Fish Venkat's last words in tears.. video goes viral!
హైదరాబాద్: తెలుగు చిత్రసీమలో తనదైన కామెడీ స్టయిల్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్ జీవితాంతం ఓ గొప్ప మెసేజ్‌ను అందించారు. “గుట్కాలు తినొద్దు” అంటూ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంటూ, ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఫిష్ వెంకట్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ – “నాకూ పాన్ మసాలాలంటే బాగా ఇష్టం. రోజుకి 30 నుంచి 40 గుట్కాలు తినేవాణ్ని. కానీ వాటి వల్ల నాకేంటో తెలిసేలోపే ఆరోగ్యం బాగానే పడిపోయింది. మాట కూడా సరిగ్గా రావడం లేదని తెలిసింది. తర్వాత ఓ డాక్టర్ సూచనలతో గుట్కాలను తగ్గించాను. మెల్లిమెల్లిగా పూర్తిగా మానేశా. ఇప్పుడు మళ్లీ మాట్లాడగలుగుతున్నాను. దయచేసి ఎవరూ గుట్కాలను అలవాటు చేసుకోకండి. తాను ఎదుర్కొన్న బాధను ఇంకెవరూ అనుభవించకూడదు’ అని చెప్పుకొచ్చారు.
ఈ మెసేజ్ ఇప్పుడు యువతలో చైతన్యం నింపుతోంది. అయితే ఫిష్ వెంకట్‌కి గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల తుదిశ్వాస విడిచారు. ఆర్థిక ఇబ్బందులు, సరైన సమయంలో కిడ్నీ దాత దొరకకపోవడం కూడా ఆయన ఆరోగ్య సమస్యలను మరింత బలపరిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఫిష్ వెంకట్ తన నటనా ప్రస్థానంలో వందకు పైగా తెలుగు సినిమాల్లో నటించారు. “ఆది, దిల్, బన్నీ, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు” వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో తన హాస్యంతో ప్రేక్షకులను అలరించారు. ఆయనకు “ఒక్కసారి తొడకొట్టు చిన్నా” వంటి డైలాగ్‌ల ద్వారా ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
తీవ్ర నిస్సహాయత మధ్య ఫిష్ వెంకట్ ఇచ్చిన చివరి మెసేజ్.. గుట్కాలకు గుడ్‌బై చెప్పండి, జీవితం కోసం పోరాడండి. ఇప్పుడు ఎంతో మందికి మేలైన మార్గదర్శకంగా నిలుస్తోంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…
స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…
రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…