General News

డెబిట్ కార్డ్ సైజులో ఆధార్.. ఎలా పొందాలంటే..!!

ఈరోజుల్లో మనం ఎలాంటి ప్రభుత్వ పథకానికి అర్హత పొందాలన్నా, స్కాలర్ షిప్ పొందాలన్నా, గుర్తింపు కార్డుగా కూడా ఆధార్ కార్డ్ ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డ్ లేని వాళ్లు పడే అవస్థలు అన్నీఇన్నీ కాదు. ఆధార్ కార్డ్ దేశంలో ఎక్కడైనా ఉపయోగపడుతుంది. అయితే ప్రజలు ఆధార్ ను చిన్న సైజులో అందుబాటులోకి తెస్తే బాగుంటుందని పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. దీంతో కేంద్రం చిన్న సైజులో ఆధార్ కార్డులు ప్రజలకు ఇవ్వడానికి సిద్ధమైంది.

 

ఎవరైతే ఎక్కువగా ప్రయాణాలు చేస్తారో, ఆధార్ కార్డుతో ఎక్కువగా ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి ఈ చిన్నసైజు కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కార్డును పర్సులో సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. పాలి వినైల్ క్లోరైడ్ తో తయారు చేసిన కార్డు కావడంతో ఈ కార్డు క్వాలిటీతో ఉంటుంది. ఆధార్ వెబ్ సైట్ లోకి వెళ్లడం ద్వారా దరఖాస్తు చేసిన రోజు నుంచి పది రోజుల్లో ఈ కార్డును పొందవచ్చు.

దరఖాస్తు చేసిన రోజు నుంచి పది రోజుల్లో పాలి వినైల్ క్లోరైడ్ తో తయారు చేసిన ఆధార్ కార్డు ఇంటికి చేరుతుంది. కార్డ్ పొందాలంటే మొదట https://uidai.gov.in/ గెట్ ఆధార్ అనే విభాగంలోకి వెళ్లాలి. అందులో order aadhaar pvc card అనే ఆప్షన్ ను ఎంచుకుని ఆధార్ కార్డ్ నంబర్ లేదా వర్చువల్ ఐడీ లేదా ఎన్ రోల్ మెంట్ ఐడీని ఎంటర్ చేయాలి. ఆ తరువాత సెక్యూరిటీ కోడ్, మొబైల్ నంబర్, వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.

అందులో వివరాలను చెక్ చేసుకొని ఉన్న ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ ను ఎంచుకుని కార్డుకు 50 రూపాయలు పే చేయాలి. అమౌంట్ పే చేసిన తరువాత వచ్చే రిసిప్ట్ లో ఎస్.ఆర్.ఎన్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ సహాయంతో దరఖాస్తు చేసిన ఆధార్ కార్డ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ విధంగా చిన్న సైజ్ ఆధార్ కార్డ్ ను సులభంగా పొందవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

4 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

5 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

6 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

7 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

7 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

7 hours ago