Gajuwaka Conductor: గాజువాక కండక్టర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గాజువాక బస్ డిపో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఈమె డాన్స్ పై మక్కువతో పలు కార్యక్రమాలలో డాన్సులు చేస్తూ పెద్ద ఎత్తున అందరిని సందడి చేసేవారు. అయితే ఈమె డాన్స్ వీడియోలు చూసినటువంటి మల్లెమాలవారు తనకు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో అవకాశం కల్పించారు.
శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఝాన్సీ ప్రస్తుతం ఓంకార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి డాన్స్ ఐకాన్ షోలో సందడి చేశారు.ఆహాలో ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్ రమ్యకృష్ణ జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం తాజాగా ప్రోమోని విడుదల చేశారు.
వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాక ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా కండక్టర్ ఝాన్సీ మరోసారి పల్సర్ బండి పాటకి డాన్స్ వేస్తూ అందరిని సందడి చేశారు. అనంతరం వేదికపై ఈమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ తన తండ్రి వల్ల తాను చనిపోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అయితే ఆయన వల్ల నేను ఎందుకు చనిపోవాలని తనకు తానే ధైర్యం నింపుకొని తన తల్లి తమ్ముడు కోసం బ్రతకానని ఈమె వెల్లడించారు. ఇలా పొట్టకూటికోసం డాన్స్ ని ఎంచుకొని నేను డాన్స్ చేస్తున్నప్పటికీ ఎంతోమంది తనని విమర్శించారు. అలాగే కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన డాన్స్ వదులుకోలేదని నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం డాన్స్ అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…