Gang rape of a 17-year-old girl in Bhadrachalam
భద్రాచలం: తెలంగాణలోని భద్రాచలం జిల్లాలో మరోసారి ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక గిరిజన బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు శనివారం సాయంత్రం చర్ల మండల కేంద్రానికి వచ్చింది. అక్కడినుంచి వాజేడు ప్రాంతానికి వెళ్లేందుకు ఆమె ఒక ఆటో ఎక్కింది. అదే సమయంలో ఆటోలో ఉన్న కొందరు దుండగులు బాలికకు కూల్‌డ్రింగ్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటన తర్వాత బాలికను స్థానికులు గుర్తించి ఒక సంరక్షణ కేంద్రానికి తరలించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను పరిశీలించగా, ఆమె శరీరంపై పంటి గాట్లు, గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆధారాలతో పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ దారుణంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నరమ్రుగాలకు కఠిన శిక్షలు పడాలని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని వారు హెచ్చరించారు. ఈ ఘటన సమాజంలో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
పౌరాణిక కథలపై తెరకెక్కుతున్న భారీ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న…
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ చిత్రాల్లో ఒకటైన రణబాలి షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన…
టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్ ప్రేమపై తన అభిప్రాయాలను తాజాగా వెల్లడించారు. జీవితంలో…
టాలీవుడ్ నటుడు అడివి శేష్ తన జీవితంలో చోటుచేసుకున్న ఓ ప్రత్యేకమైన ప్రేమ కథను తాజాగా అభిమానులతో పంచుకున్నారు. యవ్వనంలో…
టాలీవుడ్‌లో కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి రిద్ధి కుమార్. సహజమైన అందం, సింపుల్…
భారతదేశంలో దేవాలయాలకు వెళ్లినప్పుడు లడ్డూ, పులిహోర, పండ్లు వంటి సంప్రదాయ ప్రసాదాలు అందుకోవడం సాధారణం. కానీ పశ్చిమ బెంగాల్ రాజధాని…