Ghattamaneni Adhisheshagirirao : ఎటువంటి ప్రయోగాలకైనా ముందుండి మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు తెరకు కొత్తరకం సినిమాలను పరిచయం చేసిన ఆయన ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఆంధ్ర జేమ్స్ బాండ్ గా నిలిచిన ఆయన నేడు అశేష తెలుగు అభిమానులను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అయన నవంబర్ 15న మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ వల్ల మరణించారు. మహేష్ బాబు కుటుంబంలో వరుసగా విషాదాలు నెలకొన్నాయి. మొదట సోదరుడు రమేష్ బాబు మరణించడం, ఆ తరువాత ఇటీవలే తల్లి ఇందిర గారు మరణించడం, ఆవిడ మరణించిన కొద్ది రోజులకే కృష్ణ గారు మరణించడం తో మహేష్ ఒంటరి అయిపోయారు.
విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నాక అమ్మ, వదిన రియాక్షన్ అదే…
ఇక కృష్ణ గారి భార్యగా ఇందిరా దేవి గారు బయట ఎక్కువగా కనిపించలేదు. కేవలం కృష్ణ గారి భార్యగా విజయనిర్మల గారు మీడియా ముందు కనబడేవారు. పెళ్ళై రమేష్ బాబు పుట్టిన తరువాత కృష్ణ గారు విజయ నిర్మల గారిని వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకుండా రెండో వివాహాన్ని ఇందిరా దేవి గారు అంగీకరించడంలో కృష్ణ గారి తమ్ముడు ఆదిశేషగిరి రావు గారి పాత్ర ఎంతైనా ఉంది. ఇక ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ కృష్ణ గారి వ్యక్తిగత విషయంగానే విజయనిర్మల తో వారి పెళ్లిని చూసామని చెప్పారు.
కుటుంబంలో అయితే మొదట అమ్మ కొంత వ్యతిరేకత వ్యక్తం చేసినా చివరికి సర్దుకుని వదినకు నచ్చజెప్పిందని ఆదిశేషగిరి గారు చెప్పారు. వదినకు అమ్మ నీ స్థానం ఎక్కడికీ పోదు నీ బిడ్డలకు అన్యాయం జరగదు ఆ మాట మీదనే ఈ పెళ్లిని ఒప్పుకున్నట్లు చెప్పడంతో వదిన కూడా అంగీకరించారని, గొడవ పడితే కుటుంబంలో అనవసరంగా కలతలు వస్తాయని అలోచించి వదిన గొప్ప నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…