Anchor Anitha Chowdary : తొంభైల్లో యాంకర్ గా అన్ని ఛానెల్స్ లో పనిచేసి పాపులర్ అయిన అనితా చౌదరి ఈటీవీ లో యాంకర్ గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసారు. ఆ తరువాత మంజుల నాయుడు గారి సీరియల్ కస్తూరితో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత వరుసగా ఋతురాగాలు, నాన్న అంటూ సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమాల్లోనూ నటించిన అనితా చౌదరి మొదట హీరోయిన్ గా అవకాశం వచ్చినా వ్యక్తిగత కారణాలతో వదులుకుంది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన అనిత ప్రస్తుతం బుల్లితెర, వెండి తెరకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ పరమైన విశేషలను తెలిపారు.
ఆ హీరో బాగా హర్ట్ అయ్యాడు…
బుల్లితెర మీద అప్పట్లో ఉన్న యాంకర్స్ ఝాన్సీ, సుమ, ఉదయభాను, అనిత కాగా అనిత చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ అలానే సీరియల్స్ లో కూడా నటించారు. ఓ వైపు వాటిని కొనసాగిస్తూనే మరో వైపు సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేసే ప్రోగ్రామ్స్ చేసేవారు. అలా ఒకసారి చిన్నప్పటి నుండి స్నేహితుడే అయిన ఒక స్టార్ హీరోని ఇంటర్వ్యూ చేసినపుడు ఒరేయ్ అని అనడంతో అతను ఫీల్ అయ్యాడంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆతని పేరు చెప్పాడానికి ఇష్టపడని అనిత ఆ స్టార్ హీరో తో చాలా ఏళ్ళ నుండి స్నేహం ఉండటం, ఇద్దరూ ఒరేయ్ ఒసేయ్ అని పిలుచుకునేంత చనువు ఉండటంతో ఇంటర్వ్యూలో అలా పిలిచేసరికి ఫీల్ అయ్యాడని ఎడిటింగ్ వాళ్లకు అలా పిలిచినవన్నీ ఎడిట్ చేయమని చెప్పడంతో నేనే నెక్స్ట్ టైం నుండి అలా పిలవను అతనిప్పుడు స్టార్ హీరో కాబట్టి అని అన్నారట అనిత.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…