YS Jagan: తెలంగాణలో ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు చోటు చేసుకున్నటువంటి కూల్చివేతల సంచలనంగా మారాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాదులోని బంజారాహిల్స్ లోటస్ పాండ్ వద్ద భవనం ఉన్న విషయం తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్నందున ఈ ఇంట్లో చాలాకాలం నుంచి నివాసం ఉండట్లేదు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
ఇకపోతే లోటస్ పాండ్ వద్ద ఉన్నటువంటి తన ఇంట్లో తన చెల్లెలు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తన తల్లి విజయమ్మ ఉంటున్నారు. ఈమె తెలంగాణ ఆంధ్ర రాజకీయాలలో చురుగ్గా ఉన్నా కూడా ఇక్కడి నుంచే కార్యాచరణ నిర్వహించేవారు. అయితే తెలంగాణలో అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నటువంటి తరుణంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు సెక్యూరిటీ కోసం వేయించుకున్న మూడు షెడ్లను కూల్చి వేశారు.
ఈ విధంగా జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలు నిర్వహించడంతో రహదారి చాలా అసౌకర్యంగా మారిందని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ హేమంత్ ఈ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయం పై అధికారులకు కూడా తెలియకుండా జరిగాయని తాజాగా మరొక వైరల్ గా మారింది.
సీఎంకు తెలియదా…
ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలను తొలగిస్తున్నటువంటి విషయం తెలియదని, అయితే ఈ కూల్చివేతలు జరిగిన 24 గంటల లోపే సదరు అధికారిపై సస్పెన్స్ వేటు వేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.జగన్ ఇంటి వద్ద ఆక్రమణలను తొలగించాలంటూ దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు మౌఖిక ఆదేశాలను జారీ చేయడం వల్లే జీహెచ్ఎంసీ అధికారులు అక్కడ కూల్చివేతలు నిర్వహించారు. అయితే ఈ కార్యాచరణలో భాగంగా అధికారి హేమంత్ పై సస్పెన్షన్ వేటుపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…