తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి, పక్షపాతంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించబడిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రేవంత్ మాట్లాడుతూ, రీడిజైనింగ్ పేరుతో కేసీఆర్ డిజైన్లను మార్చారని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యి మూడు సంవత్సరాలకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో ప్రారంభించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును పూర్తిగా మార్చి, ఊరు, పేర్లు, అంచనాలను కూడా తారుమారు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
అలాగే, NDSA నివేదికలోనే అన్నారం, సుందిళ్ల వద్ద లోపాలు ఉన్నట్లు తేలిందని చెప్పారు. ప్రాజెక్టు ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ—మూడు దశల్లోనూ అనేక లోపాలు బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారమే ఈ అవకతవకలపై విచారణ జరిపించామని, పీసీ ఘోష్ 16 నెలలపాటు సుదీర్ఘంగా విచారణ చేసి 665 పేజీల రిపోర్టును సమర్పించారని రేవంత్ వివరించారు. ఈ విచారణలో కేసీఆర్, హరీష్ రావుతో పాటు అనేక మందిని కమిషన్ ప్రశ్నించిందని తెలిపారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిపి, అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు చేపడతామని రేవంత్ స్పష్టం చేశారు. “ఇది ప్రభుత్వం లేదా పార్టీ ఇచ్చిన నివేదిక కాదు, కమిషన్ ఇచ్చిన రిపోర్టే. కేబినెట్‌లో దానిని చర్చించి ఆమోదించాం” అని అన్నారు. అయితే, కేసీఆర్ అరెస్టుపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ అంతకుముందు కేసీఆర్ పార్టీ నేతలతో మాట్లాడుతూ, తాను అరెస్టయినా భయపడాల్సిన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం.
ఈ సందర్భంగా నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే కేవలం ₹38,000 కోట్ల ఖర్చుతో 16 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ అధికారం లోకి వచ్చిన తర్వాత డిజైన్లను ఇష్టానుసారం మార్చి, NBFCల నుంచి అధిక వడ్డీలకు ₹84,000 కోట్ల రుణాలు తెచ్చుకున్నారని ఆరోపించారు. ఈ రుణాల వ్యవహారంలోనే పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని తెలిపారు. కేబినెట్ ఈ నివేదికను ఆమోదించడంతో, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ప్రభుత్వం ఇప్పుడు తదుపరి చర్యల కోసం సిద్ధమవుతోంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…