ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న విలయతాండవం నేపథ్యంలో దానిని కట్టడి చేయడానికి కేంద్రం లాక్ డౌన్ ని అమలు చేసింది. ఆ తరువాత మెల్ల మెల్లగా లాక్ డౌన్ ను పలు ఆంక్షలతో ఎత్తివేస్తుంది. సినిమా హాల్స్, మాల్స్, విద్యాసంస్థలు వంటి కొన్ని వాటిని మినహాయించి మిగిలినవి అన్ని తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు అన్ని ఖచ్చితంగా మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ మరియు ప్రయివేట్ విద్యాసంస్థలన్నీ ఆన్లైన్ తరగతుల మీద ద్రుష్టి పెట్టాయి. తమ విద్యార్థులకు ఆన్లైన్ లోనే పాఠాలు చెబుతున్నాయి.
అయితే ఆన్లైన్ విధ్యా విధానంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు. కొంతమంది మొబైల్ ఫోన్ లు, కంప్యూటర్ లు లేక ఇబ్బంది పడుతుంటే మరికొందరు అన్ని ఉన్నా ఇంటర్నెట్ నెట్ వర్క్ సరిగ్గా రాక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన నమిత నారాయణ్ అనే విద్యార్ధిని నెట్ వర్క్ రావడం లేదని ఏకంగా తన ఇంటిపైకి ఎక్కి కూర్చుంది. ఆన్లైన్ క్లాసులు ఎగ్గొట్టడానికి కొందరు విద్యార్థులు అనేక ఆలోచనలు చేస్తుంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా చదువుకోవడం కోసం ఆ విద్యార్థి పడుతున్న తప్రాయం చూసి ఓ అక్కడే నివసించే ఒక వ్యక్తి ఆమె ఇంటిపై కూర్చున్నపుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇప్పుడే ఆ ఫోటో వైరల్ అయింది. చదువు మీద ఉన్న శ్రద్ధతో ఇల్లు ఎక్కి మరి ఆన్లైన్ క్లాసులు వింటున్న ఆ విద్యార్థిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…