General News

మళ్లీ పరుగులు తీస్తున్న పసిడి… ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం, వెండీ ధరలు!

రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు పసిడి ప్రియులకు ఊరటనిచ్చినప్పటికీ, శుక్రవారం నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిన్నటి నుంచి బంగారం మళ్లీ పరుగులు తీస్తూ కొనుగోలు దారులకు చుక్కలు చూపిస్తోంది. ఒక్క శుక్రవారం రోజే తులం బంగారంపై ఏకంగా రూ.5,000 వరకు పెరుగుదల నమోదు కాగా, ఇవాళ కూడా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

శనివారం ఉదయం కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే బంగారం ధరపై రూ.1,470 పెరిగింది. హైదరాబాద్లో ఉదయం 6 గంటలకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,160గా ఉండగా, ఉదయం 10 గంటలకు అది రూ.1,58,620కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.1,44,060గా ఉండగా, కొన్ని గంటల్లోనే రూ.1,45,400కు పెరిగింది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. ముంబై, కేరళ, కోల్‌కతా, పుణే, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,620గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,400 వద్ద ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,770గా ఉండగా, చెన్నైలో ఇది రూ.1,59,490గా నమోదైంది.

ఇక వెండి విషయానికి వస్తే బంగారాన్ని మించి వేగంగా దూసుకెళ్లింది. శుక్రవారం ఒక్కరోజే కేజీ వెండి ధరపై రూ.20,000కు పైగా పెరుగుదల నమోదైంది. అయితే ఇవాళ ఆ వేగం కొద్దిగా తగ్గింది. శనివారం కేజీ వెండి ధరపై కేవలం రూ.100 మాత్రమే పెరిగింది.

భారీ హెచ్చుతగ్గుల అనంతరం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.5,000 తగ్గి రూ.3,45,000కు చేరగా, హైదరాబాద్‌లో మాత్రం వెండి ధర కేజీకి రూ.3,60,100గా కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ మారకం విలువ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం – వెండి ధరల్లో ఇలాంటి తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు దారులు, పెట్టుబడిదారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago