General News

Gongadi Trisha: సంచలనం సృష్టించిన గొంగడి త్రిష… అసలు ఎవరీ ఈ త్రిష… ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Gongadi Trisha: గొంగడి త్రిష ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతున్న పేరు. క్రికెట్ రంగంలో రాణిస్తూ సంచలనాలను సృష్టిస్తున్న ఈ గొంగడి త్రిష పేరు ఇప్పుడు మారుమోగుతుంది. దీంతో ఈమె ఎవరు తన బ్యాగ్రౌండ్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన అండర్ -19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను భారత్ వరుసగా రెండో సారి కైవసం చేసుకుంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో గొంగడి త్రిష మూడు వికెట్లు తీసింది. వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా, పరుణిక తలా రెండు వికెట్లు తీశారు. షబ్నమ్ ఓ వికెట్ పడగొట్టింది. అనంతరం గొంగడి త్రిష 44 నాటౌట్‌; 33 బంతుల్లో 8 కోట్లు కొట్టి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. దీంతో ఈమె పేరు మారుమోగుతుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈమె ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో జన్మించింది గొంగడి త్రిష. ఆమె తండ్రి రామిరెడ్డికి ఆటలంటే ఎంతో ఇష్టం. ఐటీసీలో ఫిట్‌నెస్ సలహాదారుడిగా పని చేశారు. ఇక చిన్నప్పటినుంచి త్రిషకు క్రికెట్ అంటే ఎంతో ఆసక్తి ఉంది అని గ్రహించిన తన తండ్రి రామిరెడ్డి తనని అదే దిశగా ప్రోత్సహించారు. క్రికెట్ అంటే తనకిష్టమని గ్రహించిన ఈయన తన సొంత గ్రామం వదిలి హైదరాబాద్ కి వచ్చి సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో ఏడేళ్ల త్రిషను చేర్చాడు.

ఇదే అకాడమీలో ప్రముఖ క్రికెట్ ప్లేయర్ మిథాలీ రాజ్ ను చూస్తూ పెరిగిన త్రిష కొన్ని సందర్భాలలో ఆమె సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ క్రికెట్లో బాగా రాణించింది. రోజుకు ఏడెనిమిది గంటల ప్రాక్టీస్ చేసేది. ఈ క్రమంలో 8 ఏళ్లకే అండర్‌-16, 12 ఏళ్లకే అండర్‌-19 టోర్నీల్లో ఆడింది. 13 ఏళ్లకే బీసీసీఐ ఛాలెంజర్స్ టోర్నీ బరిలో దిగింది. ఇలా ప్రతి ఒక్క మ్యాచ్ తన ఆటతీరును కనబరుస్తు విజయాలు అందుకుంటున్న త్రిష పట్టుదల చూస్తుంటే అతి త్వరలోనే భారత మహిళల సీనియర్ జట్టులోనే చోటు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

telugudesk

Recent Posts

పరగడుపున పండ్లు తినొచ్చా? నిపుణుల స్పష్టమైన సమాధానం!

ఉదయం పరగడుపున పండ్లు తినాలా లేదా అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ…

6 minutes ago

ఆధ్యాత్మిక యాత్రకు బెస్ట్ డెస్టినేషన్.. కొండల మధ్య భక్తి క్షేత్రాలు.. తప్పక చూడాల్సిన దేవాలయాలు!

ఆంధ్రప్రదేశ్‌లో ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానాన్ని సంపాదించిన పుణ్యక్షేత్రాల్లో విజయ కీళాద్రి ఆలయాలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. వివిధ జిల్లాల్లో విస్తరించి…

36 minutes ago

తాతను ఆటపట్టించిన మనవడు.. మోహన్‌బాబు క్యూట్ రియాక్షన్ వైరల్

తెలుగు సినీ రంగంలో క్రమశిక్షణ, గంభీరమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచే మంచు మోహన్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్…

37 minutes ago

కరుప్పు లో త్రిష ఎంపికపై.. డైరెక్టర్ ఓపెన్ స్టేట్‌మెంట్!

తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కరుప్పు’పై ఇప్పటికే మంచి అంచనాలు…

44 minutes ago

ఏసీ లేకుండానే ఇల్లు చల్లగా.. ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చేయండి!

వేసవి రాగానే ఇంట్లో ఉండటం చాలా మందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసించే వారికి గదులు భగ్గుమంటూ…

1 hour ago

చక్రి మరణంపై షాకింగ్ నిజాలు.. రఘు కుంచె క్లారిటీ

దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…

1 hour ago