India High Resolution Unemployment Concept
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి లక్షల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైంది. కరోనా, లాక్ డౌన్ వల్ల నష్టాల పాలైన ప్రైవేట్ సంస్థలు ఉద్యోగుల తొలగింపు దిశగా అడుగులు వేశాయి. అయితే కరోనా వల్ల ఉద్యోగం కోల్పోయిన వారికి కేంద్రం కొన్ని రోజుల క్రితం తీపికబురు చెప్పింది. అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకంలో నియమ నిబంధనల్లో కీలక మార్పులు చేసి ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రయోజనం చేకూరేలా చేసింది.
అయితే కేంద్రం ఉద్యోగం కోల్పోయిన వారి కోసం మరో ఆరు నెలల పాటు ఈ పథకానికి గడువు పొడిగించింది. ఈ.ఎస్.ఐ,సీ ఉద్యోగం కోల్పోయిన వారికి 90 రోజుల వేతనంలో 25 శాతం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తోంది. గతంలో 25 శాతంగా ఉండగా కేంద్రం కరోనా, లాక్ డౌన్ వల్ల 50 శాతం వేతనాన్ని పెంచింది. ఉద్యోగులు ఈ స్కీమ్ ద్వారా సులువుగా 50 శాతం వేతనాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ఉద్యోగులు ఎవరైనా ఉద్యోగాన్ని కోల్పోతే 30 రోజుల తరువాత ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. గతంలో ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయిన మూడు నెలల తరువాత ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసే అవకాశం ఉండగా కేంద్రం ఆ నిబంధనలలో కీలక మార్పులు చేసింది. గతంలో 2020 డిసెంబర్ 31 వరకు మారిన నిబంధనలు అమలవుతాయని చెప్పిన కేంద్రం ప్రస్తుతం 2021 జూన్ 30 వరకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది.
2018 సంవత్సరం జులై నెలలో ఈ పథకం ప్రారంభమైంది. అయితే ఉద్యోగి తన జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందే విధంగా ఈ స్కీమ్ నిబంధనలు ఉన్నాయి. https://www.esic.nic.in/ వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుని ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను సులువుగా పొందవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…