Categories: Political News

గువ్వల బాలరాజు రాజీనామా.. కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు !

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి ఎదురవుతున్న వరుస ఎదురుదెబ్బల్లో భాగంగా, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు, విచారణలతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న బీఆర్ఎస్‌కు ఈ రాజీనామా మరింత ఇబ్బందికరంగా మారింది. సోమవారం ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు పంపగా, మంగళవారం మీడియా సమావేశంలో తన నిర్ణయంపై స్పష్టత ఇచ్చారు.

Guvvala Balaraju’s resignation.. Sensational comments on KCR family!

రాజకీయం మారడంతోనే ఈ నిర్ణయం

బాలరాజు తన రాజీనామాను పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్లనే తీసుకున్నానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికతో తన రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. “నేను ఈ నెల 2న రాజీనామా సమర్పించాను. కాళేశ్వరం నివేదిక బయటకు వచ్చిన తర్వాత రాజీనామా చేశానని చెప్పడం సరైంది కాదు. నా లేఖలో ఎక్కడా అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికే కష్టాల్లో ఉంది, నేను వారికి మరింత బాధ కలిగించదల్చుకోలేదు” అని బాలరాజు వివరించారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.

కొనుగోలు కేసు, కొత్త పార్టీలో చేరికపై బాలరాజు వ్యాఖ్యలు

రాజకీయాల్లోకి రాకముందే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను కేవలం పాత్రధారినేనని, సూత్రధారి కాదని గువ్వల బాలరాజు మరోసారి స్పష్టం చేశారు. ఈ ఘటనకు తాను కేసీఆర్ ఆదేశాల మేరకే వెళ్లానని వెల్లడించారు. అలాగే, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని తాను ఎప్పుడూ మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు.

“కాంగ్రెస్‌లోకి రావాలని పెద్ద నాయకులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మా నియోజకవర్గానికి చెందినవారే. అయితే, ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా ఖరారు చేయలేదు. నా అనుచరులు, జిల్లా ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తాను” అని బాలరాజు వెల్లడించారు. బాలరాజు ఏ పార్టీలో చేరతారనే విషయంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago