Aishwarya Rai: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నటువంటి ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ గురించి ఈ మధ్యకాలంలో తరచూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ దంపతులు విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అయ్యాయి. మొదట్లో ఈ వార్తలు పై అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ గట్టి సమాధానం ఇచ్చారు.
ఇటీవల కూడా మరోసారి ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఐశ్వర్యరాయ్ ఒక్కతే కనిపిస్తోంది అంతేకాకుండా ఈమె 50వ పుట్టినరోజు వేడుకలలో భాగంగా తన కుమార్తె తన తల్లితో కలిసి ఐశ్వర్య కేక్ కట్ చేశారు. కానీ అక్కడికి అభిషేక్ రాలేదు. దీంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని విడిపోతున్నారని త్వరలోనే ఐశ్వర్య తన కుమార్తెను తీసుకొని బచ్చన్ ఫ్యామిలీ నుంచి బయటకు రాబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.
ఈ వార్తలకు తోడు బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ కూడా వీరు విడాకులకు సిద్ధమయ్యారు అంటూ చెప్పడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ వార్తలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా ఈ వార్తలకు సంబంధించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల ఆరాధ్య స్కూల్ డే ఫంక్షన్ కోసం ఐశ్వర్యరాయ్ తో పాటు తన మామయ్య అమితాబ్ బచ్చన్ అలాగే తన భర్త అభిషేక్ బచ్చన్ అందరూ కలిసి కనిపించారు.
కలిసి కనిపించిన ఐశ్వర్య అభిషేక్…
ఈ వీడియోలో ఐశ్వర్య అభిషేక్ ఇద్దరు కూడా చాలా సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ కనిపించడంతో వీరిద్దరి విడాకుల గురించి వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా ఆవాస్తవమని అందులో ఏమాత్రం నిజం లేదు అందుకు నిదర్శనమే ఈ వీడియో అంటూ మరికొందరు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. మరి ఐశ్వర్య అభిషేక్ విడాకుల గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…
దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి. తాజాగా FASTag సేవల పేరుతో భారీ ఆన్‌లైన్ మోసం వెలుగులోకి…
తెలంగాణలో ఉన్నత విద్యను ఆశించే విద్యార్థులకు కీలక సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో…