Movie News

Raghavendra Rao: అది తెలిసే సుమ ఇద్దరు పిల్లలని కన్నది లేకుంటే అంటూ సుమ వ్యక్తిగత విషయాలపై మాట్లాడిన దర్శకేంద్రుడు!

Raghavendra Rao: సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా హాజరైన సంగతి తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు కూడా హాజరయ్యారు. ఈ సినిమాకి ఈయన నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మనం బబుల్ గమ్ నములుతూ ఉంటే దానిలోని సాఫ్ట్ నెస్ ఎక్కువ అయ్యి ఎలా పేలుతుందో ఈ సినిమా కూడా అలాగే పేలుతుందని ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ అందుకుంటుందని రాఘవేంద్రరావు తెలిపారు.

ఇక ఈయన సుమ, రాజీవ్ గురించి మాట్లాడుతూ… వీరిద్దరికి మా సినిమా సెట్ లోనే పెళ్లి జరిగిందని తెలిపారు. అబ్బో జనం అబ్బబ్బో జనం ఇలా అయితే ఎలా భోజనం అనే పాటలో నటించింది. ఈ పాటలో నటించడం వల్ల జనం ఎక్కువైతే కలిగే సమస్య ఏంటో తనకు తెలుసు కాబట్టి ఈమె ఇద్దరినీ మాత్రమే కన్నదని లేకపోతే వరుసగా అంటూ సుమ కొడుకు ముందే తన పర్సనల్ విషయాల గురించి రాఘవేంద్రరావు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ముద్దు సీన్ ఉంటే సినిమా హిట్…

ఇక ప్రస్తుత కాలంలో సినిమాలో ముద్దు సీన్ ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుంది. ఇక ఈ సినిమాలో ఎన్నో ముద్దు సీన్లు ఉన్నాయి అంటే ఈ సినిమా మరింత సక్సెస్ అవుతుంది అంటూ ఈయన సినిమాపై ధీమా వ్యక్తం చేశారు మరి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సుమ రాజీవ్ వారసుడుగా ఇండస్ట్రీలోకి వస్తున్నటువంటి రోషన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago