Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నటువంటి ప్రభాస్ ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన సలార్ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ ఈ సినిమా కథను తాను ప్రశాంత్ ఇద్దరు కూర్చొని సిద్ధం చేశామని తెలిపారు. నాలో ఉన్నటువంటి ఆలోచనలు నేను చెప్పగా ప్రశాంత్ కొన్ని యాడ్ చేసి ఈ సినిమా కథను సిద్ధం చేశారని ప్రభాస్ వెల్లడించారు. ఇక ఈ సినిమా కోసం నేను పెద్దగా కష్టపడింది ఏమీ లేదని తెలిపారు. నేను ఈ సినిమా షూటింగ్ కి రావాలి అనే ఫీలింగ్ కంటే అక్కడికి వెళ్తే ప్రశాంత్ తో ఆనందంగా ఉండవచ్చు అన్న ఉద్దేశంతోనే షూటింగ్ కి వచ్చేవాడినని ఎప్పుడూ కూడా ఆయన నన్ను వెయిట్ చేయనివ్వలేదు, అతని ప్లానింగ్ చూసి నేను ఆశ్చర్యపోయాను అంటూ ప్రభాస్ తెలిపారు.
నేను షూటింగ్ లొకేషన్లోకి వచ్చేలోపు ప్రశాంత్ అన్ని సిద్ధం చేసి పెట్టుకొని ఉంటారని నేను సెట్ లోకి రాగానే ప్రశాంత్ నా పైనే ఎక్కువగా షూట్ చేసేవారని ప్రభాస్ తెలిపారు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసిన తర్వాత మీరు కండలు మాత్రం పెంచాలి అంటూ డైరెక్టర్ నాకు చెప్పారు ఆయన చెప్పిన విధంగానే నేను చేశాను అయితే నాకు గత 21 సంవత్సరాల కెరియర్ లో కష్టపడిన దానికంటే ఈ సినిమా కోసం నేను పెద్దగా కష్టపడలేదని ప్రభాస్ తెలిపారు.
ప్రశాంత్ ప్లానింగ్ సూపర్..
ఇక ఈ సినిమా కథను ఎంతో వర్క్ షాప్ చేసి సిద్ధం చేసుకున్నట్లు ప్రభాస్ తెలిపారు. ఇలా సలార్ సినిమా గురించి ప్రభాస్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి ఇక ఈ టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం విశేషం.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…