పురాణాల్లో యుద్దాల సమయంలో ఒకరినొకుకు ఆధిపత్య పోరు కోసం కొట్టుకున్న సంఘటనలు చూశాం. అంతే కాకుండా టీవీల్లో కనిపించే డిస్కవరీ ఛానల్ లాంటి వాటిల్లో సింహాలు, పాములు కొట్లాడం కూడా చూశాం. అయితే అప్పుడపపుడు కొన్ని పోరాట దృశ్యాలు చూస్తే ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది.
అందులో భాగంగా.. పెంపుడు జంతువులు పోరాడుతుంటే అవి చూడటానికి ముచ్చటగా ఉంటుంది. తాజాగా రెండు పెంపుడు జింకలు కొమ్ములు పైకెత్తి రెండు కాళ్లమీద నిల్చొని ఒకదానితో ఒకటి చేస్తున్న ఫైటింగ్ చూస్తుంటే ఓ రేంజ్ లో అనిపిస్తుంది. దీనిని జింకలు పెంచుకునే యజమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దానిని నెటిజన్లు తెగ చూసేస్తున్నారు.
జింకల పోరాటం ఎంతో ఆహ్లాదం కలిగిస్తున్న ఈ ఘటనఅమెరికాలోని టెక్సాస్ లోని సోమర్ విల్లే లేక్‌లో జరిగింది. అసలు వీటి మధ్య కొట్లాట ఎలా జరిగిందంటే.. ఓ ఆడ జింక ఒంటరిగా గడ్డి మేస్తు ఉంటే.. అక్కడకు మరో ఆడ జింక వచ్చింది. వాటి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ.. హఠాత్తుగా గొడవ మొదలైంది. రెండు కాళ్లను గాల్లోకి లేపి మరీ ఒకదాన్ని ఒకటి పొడుచుకున్నాయి. కాళ్లను పైకి లేపి ముఖంపై ఆడిస్తుంటే.. చూడటానికి చాలా ఫన్నీగా అనిపిస్తుంటుంది.
ఇలా రెండు జింకలు ఒకదానికొకటి నేనంటే.. నేనంటూ కొట్లాడుకున్నాయి. ఇలా కొన్ని క్షణాల పాటు జింకలు కొట్లాడుకున్న తర్వాత అక్కడి నుంచి పరుగెత్తాయి. ఈ విషయంపై జింకలను పెంచుకొని యజమని గే ఇస్బర్ మాట్లాడుతూ.. రెండు ఆడ జింకలు కొట్టుకోవడం అనేది తన జన్మలో చూడలేదని.. ఇలా చూడటం మొదటి సారి అని అన్నారు. ఈ జింకలు కొట్టుకొని దాదాపు మూడేళ్లు అవుతున్నా ఆ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…