రోజురోజుకు సైబర్ నేరగాళ్ల తాకిడి ఎక్కవ అయిపోతుంది. ఎక్కడ చూసినా దొంగతనాలు, హత్యలు, అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి. అయితే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు కూడా అప్ డేట్ అవుతూనే ఉన్నారు. కొత్త కొత్త టెక్నాలజీతో నేరలను కూడా కొత్త కొత్తగా చేస్తున్నారు. దీంతో వాళ్లను పట్టుకోవడం పోలీసులకు ఓ సవాల్ గా మారిపోయింది. తాజాగా ఓ ఘటనలో పోలీసులతోనే దమ్ముంటే నన్ను పట్టకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ సైబర్ మోసగాడి చేతిలో తాను మోసపోయానని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అప్పుడే అతడిని మోసం చేసిన సైబర్ మోసగాడు ఫోన్ చేశాడు. ‘మీ డబ్బు వాపసు వస్తుంది.. కొన్ని చార్జిల కింద డబ్బులు చెల్లిస్తే సరిపోతుందని’..అతడికి చెబుతాడు. అప్పడు బాధితుడు తాను పోలీస్ స్టేషన్ లో ఉన్నానని.. పోలీస్ అధికారితో మీరు మాట్లాడంటూ ఫోన్ ఇస్తాడు. అతడు ఆ ఫోన్ కట్ చేయకుండా ఎలాంటి భయం లేకుండా అతడితో మాట్లాడాడు. మా ఆదాయం రోజుకు రూ.20 వేలు ఉంటుంది.. దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అంటూ ఆ అధికారికి సవాల్ విసిరాడు ఆ సైబర్ నేరగాడు.
ఆ అధికారి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంత ధైర్యంగా అతడు మాట్లాడం చూసి.. అతడి నోటి వెంట మాట కూడా మాట్లాడలేదు. అతడేం మాట్లాడంటే..‘తాను ఈ ఫోన్ మాట్లాడిన తర్వాత సిమ్ మార్చేస్తా.. మరో సిమ్ తీసుకుంటా.. సిమ్ లు సరఫరా చేసే ముఠా ఉంది.. అమాయకులకు సంబంధించి బ్యాంక్ ఖాతాలను తాము ఉపయోగించుకుంటున్నామంటూ’ చెప్పాడు.
మా ఊరిలో నేనొక్కడినే కాదు ఏడో తరగతి చదివే ప్రతీ ఒక్కడూ ఇలానే చేస్తారు అంటూ చెప్పాడు. ఆ సంభాషణ అయిన తర్వాత తాము ఉత్తరాది రాష్ట్రాల్లో అంటే జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి వారు ఈ మోసాలకు పాల్పడుతున్నారని.. ఫోన్ చేసి బ్యాంక్ వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్ప వద్దని.. ఏమైనా సమస్యలు ఉంటే.. 100 లేదా 155260కు ఫోన్ చేయాలని తెలిపారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…