ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. కాకినాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భర్త చేతిలో భార్య హత్యకు గురయింది. విషయం తెలుసుకున్న లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఈమెది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కాకిపాడుకు చెందిన గుంపుల సుధారాణి (19)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో సుధారాణి ఫస్టియర్ డిప్లమో ఇన్ అనస్తీషియా చదువుతుంది. కొన్నాళ్ల క్రితం పశ్చిమగోదారి జిల్లా పెదపాడు మండల యాళ్లగూడెంకు చెందిన 21 ఏళ్ల గంగరాజుతో పరిచయం ఏర్పరచుకుంది. తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది.
కొన్నాళ్లు ఇలా ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకుంటూ.. ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 10 నెలల క్రితం వీళ్లిద్దరికి ప్రేమ వివాహం జరిగింది. ఆమె హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్తుంది. అయితే ఓ రోజు కాకినాడ ద్వారకా లాడ్జిలో ఇద్దరూ దిగారు. వీరిద్దరి మధ్య నిన్న విపరీతంగా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఘర్షణకు దారితీయడంతో రాజుకు విపరీతంగా కోపం వచ్చింది.
అతడు క్షణికావేశంలో కత్తి తీసుకొని సుధారాణిని విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత రాజు ఏలూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో వాచరణ చేపడతామని పోలీసులు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…