కాకినాడలో దారుణం.. లాడ్జిలో వివాహిత దారుణ హత్య..

0
571

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. కాకినాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భర్త చేతిలో భార్య హత్యకు గురయింది. విషయం తెలుసుకున్న లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఈమెది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం కాకిపాడుకు చెందిన గుంపుల సుధారాణి (19)గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో సుధారాణి ఫస్టియర్ డిప్లమో ఇన్ అనస్తీషియా చదువుతుంది. కొన్నాళ్ల క్రితం పశ్చిమగోదారి జిల్లా పెదపాడు మండల యాళ్లగూడెంకు చెందిన 21 ఏళ్ల గంగరాజుతో పరిచయం ఏర్పరచుకుంది. తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది.

కొన్నాళ్లు ఇలా ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకుంటూ.. ప్రేమించుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో 10 నెలల క్రితం వీళ్లిద్దరికి ప్రేమ వివాహం జరిగింది. ఆమె హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్తుంది. అయితే ఓ రోజు కాకినాడ ద్వారకా లాడ్జిలో ఇద్దరూ దిగారు. వీరిద్దరి మధ్య నిన్న విపరీతంగా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇది ఘర్షణకు దారితీయడంతో రాజుకు విపరీతంగా కోపం వచ్చింది.

అతడు క్షణికావేశంలో కత్తి తీసుకొని సుధారాణిని విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత రాజు ఏలూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో వాచరణ చేపడతామని పోలీసులు తెలిపారు.