General News

హైదరాబాద్‌పై వరుణ దేవుడి ఉగ్రరూపం.. అతలాకుతలమైన జనజీవనం

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్రంలో, గురువారం హైదరాబాద్ తో పాటు దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ భారీ వర్షాల కారణంగా నగర జీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయింది. రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.

Heavy rains in Hyderabad disrupt public life

అతలాకుతలమైన నగర జీవనం

గంటల వ్యవధిలోనే కురిసిన కుండపోత వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లి వీధులన్నీ వరదనీటితో నిండిపోయాయి. కృష్ణా నగర్లో వరద ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోయినట్లు సమాచారం. లోతట్టు ప్రాంతాలైన అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, కృష్ణా నగర్‌లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దాదాపు 200 ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్ల పక్కన పార్క్ చేసిన దాదాపు 500 బైకులు, ఇతర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయి రోడ్లు కిలోమీటర్ల మేర స్తంభించిపోయాయి.

రికార్డు స్థాయిలో వర్షపాతం, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత

గచ్చిబౌలిలో 14 సెంటీమీటర్లు, సరూర్‌నగర్‌లో 13 సెంటీమీటర్లు, నగరవ్యాప్తంగా సగటున 12.5 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అధికారులు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేయడంతో, దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

మరో మూడు రోజులు వర్షాలు

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, ఈరోజు (శుక్రవారం) కూడా హైదరాబాద్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago