బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది సంతోషించాల్సిన విషయమే అయినా, అందులో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో విన్ అవ్వాలి. ఈ క్రమంలోనే అక్కడ ఫిజికల్ గా,మెంటల్ గా ఒత్తిడికి గురి చేస్తాయి. అంతేకాకుండా మనకు ఇష్టమైన వారితో కూడా గొడవలు వస్తుంటాయి. అయితే తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికే నాలుగు సీజన్ లు విజయవంతంగా పూర్తిచేసుకొని ఐదవ సీజన్ లోకి అడుగుపెట్టింది. అయితే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లే కాకుండా, ఒత్తిడిని తట్టుకోలేక మధ్యలోనే వెళ్లిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. మరి ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఎప్పుడూ లేనివిధంగా సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఆ కంటెస్టెంట్ లలో సంపూర్ణేష్ బాబు కూడా ఒకరు. హృదయ కాలేయం సినిమాతో ఓవర్ నైట్ పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
అనంతరం హౌస్ వాతావరణాన్ని తట్టుకోలేక, నాలుగు గోడల మధ్యలో నలుగురితో కొట్లాటలు ఇవన్నీ సరిపోక బిగ్ బాస్ హౌస్ నుంచి తనని పంపాలని సంపూర్ణేష్ కన్నీరు పెట్టుకున్నాడు. అలా షో మొదలైన 9వ రోజు సంపూర్ణేష్ ని హౌస్ నుండి బయటకు పంపారు.
ఇక బిగ్ బాస్ సీజన్ 2 లోకి ఎవరికీ తెలియని నూతన్ నాయుడు అనే ఒక కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో టాస్క్ ఆడుతున్న సమయంలో నూతన్ నాయుడు కాలికి దెబ్బ తగలడంతో, ఎలిమినేట్ కాకుండానే బయటకు వచ్చేసాడు. కోలుకున్న తర్వాత మళ్లీ హౌస్ లోకి వెళ్లడం ఎలిమినేట్ కావడం కూడా జరిగింది.
బిగ్ బాస్ సీజన్ 3 లోకి అలీ రెజా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఏడవ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఆడియన్స్ కోరిక మేరకు మళ్ళీ ఎంట్రీ ఇచ్చి టాప్ 5 లిస్టులో 4వ స్థానం లోకి చేరాడు.
బిగ్ బాస్ సీజన్ 4 లోకి కంటెస్టెంట్ గా గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో హ్యాపీ గా కనిపించిన 5 వారాల తర్వాత హౌస్ లో గంగవ్వ ఉండలేకపోయింది. పిల్లలు గుర్తుకు వస్తున్నారని, ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో బయటికి పంపాలని విజ్ఞప్తి చేసింది. అలా గంగవ్వ బయటకు వచ్చేసింది.
అలాగే బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న మరొక కంటెస్టెంట్ సింగర్ నోయల్ కూడా అనారోగ్యం కారణంగా నడవలేక ఇబ్బంది పడుతున్న నోయల్ ని ఎనిమిదో వారం బిగ్ బాస్ నుంచి ఇంటి నుంచి బయటకు పంపించేశారు.
ఇక ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో నుంచి తాజాగా ఆరోగ్యం కారణంగా జెస్సి బయటకు వచ్చేసాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…