నిత్యావసర ధరలు పెరుగుతున్నా పట్టించుకునేవారు లేరు కానీ… థియేటర్ల పై ఆంక్షలు విధిస్తారు: నాని

కరోనా కారణం వల్ల మూతబడిన థియేటర్లపై థియేటర్లలో పెట్టిన ఆంక్షల గురించి నటుడు నాచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్య ప్రజలపై అధిక భారంగా ఉన్నటువంటి నిత్యావసర ధరలు పెరుగుతున్నా, వాటికి పరిష్కార మార్గం ఆలోచించకుండా థియేటర్లపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారంటూ తాజాగా “తిమ్మరుసు”ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్, అది ఒక కల్చర్. ఒక వ్యక్తి ఇంట్లో తర్వాత ఎక్కువ సేపు సినిమాను చూడగలిగేది అంటే థియేటర్లో మాత్రమేనని నాని తెలిపారు.సినిమా అంటే చాలామంది చిన్నచూపు చూడటం వల్లే ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయని నాని విమర్శించారు. సాధారణంగా రెస్టారెంట్ షాపింగ్ మాల్స్ తో పోలిస్తే థియేటర్లు ఎంతో సేఫ్ అని, కానీ కరోనా నిబంధనల పేరిట అన్నిటికంటే ముందుగా థియేటర్లను మూసేయమని అన్నిటికంటే చివరిగా థియేటర్లు తెరవడానికి అనుమతిస్తున్నారు అంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మనదేశంలో సినిమా ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే థియేటర్లపై ఇలాంటి ఆంక్షలు విధించడం వల్ల ఎన్నో లక్షల మంది బతుకుల పై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని,పరిస్థితులు ఇలాగే కొనసాగితూ వెళ్తే థియేటర్ అనే ఒక వ్యవస్థ నాశనం అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ క్రమంలోనే సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “తిమ్మరుసు”చిత్రాన్ని ఈ నెల 30వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్న సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను జూలై 26న యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నాచురల్ స్టార్ నాని పాల్గొని తనదైన శైలిలో తన భావాలను వ్యక్తపరిచారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న క్రైమ్, థ్రిల్లర్ చిత్రంలో సత్యదేవ్ సరసన
ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‏గా నటిస్తుంది.