Categories: FeaturedMovie News

Hero Sai Dharam Tej : చిరంజీవి గారికి నాపై కోపం వచ్చింది, ఎందుకంటే… అదే చిన్న బాధ…: హీరో సాయి ధరమ్ తేజ్

Hero Sai Dharam Tej : మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన హీరోలలో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ ది డిఫరెంట్ స్టైల్ అనొచ్చు. మామ చిరంజీవి లాగానే వేసే డాన్సులో గ్రేస్ ఉంటుంది ఈ మెగా మేనల్లుడికి. సినీ పరిశ్రమలో అడుగు పెట్టి తనకంటూ సొంత గుర్తింపుతో దూసుకెళ్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇంతలోనే ఎవరూ ఊహించని పరిణామం సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్, దాదాపు 45 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా ఉన్న సాయి ధరమ్ తేజ్ మళ్ళీ హీరోగా మన ముందుకు వస్తాడా అని అందరూ అనుకున్నా చివరకు మళ్ళీ హీరోగా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సాయి ధరమ్. తాజాగా తాను నటించిన ‘విరూపాక్ష’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సాయి తన మావయ్యల గురించి మాట్లాడారు.

చిరంజీవి మావయ్యకి కోపం వచ్చింది…

సాయి విరూపాక్ష సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్నప్పటి విశేషాలను, ముగ్గురు మావయ్యలతో ఉన్న అనుబంధాన్ని వివరించాడు. ఎపుడూ కోప్పడని చిరంజీవి గారు తనపై ఒకసారి కోప్పడ్డారని వివరించారు. చెన్నై లో చదివే సమయంలో ఎపుడూ క్లాస్ బయట నిలబెట్టే వారని, చదువు పెద్దగా రాకపోవడంతో ఇంటికి కంప్లెయింట్స్ వెళ్ళేవని, ప్రతిసారి అమ్మ వచ్చేది కాబట్టి పెద్దగా భయపడేవాడిని కాదు కానీ ఒకసారి మావయ్య షూటింగ్ కోసం చెన్నై వచ్చి ఇంటికి రావడం, అదే సమయంలో స్కూల్ నుండి ఫోన్ రావడంతో మావయ్య మాట్లాడారు.

స్కూల్ నుండి ఇంటికి వచ్చాక మావయ్య చూసినా చూపుకు బాగా భయం వేసింది. ఆరోజు చూసిన కోపం నేనెపుడు చూడలేదు అంటూ చెప్పారు. ఇక నాగబాబు మావయ్య ఎపుడూ నవ్విస్తూ నవ్వుతూ ఉంటారని కళ్యాణ్ మావయ్య కూడా బాగా నవ్విస్తారు, తాను అందరూ సీరియస్ గా ఉన్న సమయంలో జోక్స్ వేసి నవ్విస్తారు అంటూ చెప్పాడు సాయి. ఇక తనకు ఆక్సిడెంట్ అయి హాస్పిటల్ లో ఉన్న సమయంలో రిపబ్లిక్ సినిమా ప్రమోషన్స్ కోసం మొత్తం కుటుంబ సభ్యులందరూ వచ్చి సినిమా ప్రమోషన్స్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. చరణ్, బన్నీ, వరుణ్ నిహారిక ఇలా అందరూ నా సినిమా కోసం రావడం ఆనందాన్ని ఇచ్చినా ఆ దృశ్యం నేను చూడేలేదనే బాధ కూడా కొద్దిగా ఉంది అంటూ చెప్పాడు సాయి ధరమ్ తేజ్.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago