General News

Divya Deshmukh : చెస్ టైటిల్‌తో దుమ్మురేపిన దివ్య దేశ్‌ముఖ్‌.. ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

భారతీయ చెస్ ప్రతిభ దివ్య దేశ్‌ముఖ్ (Divya Deshmukh) చరిత్ర సృష్టించారు. 19 ఏళ్ల ఈ యువతి 2025 ఫిడే మహిళల ప్రపంచకప్‌ (FIDE Women’s World Cup)ను గెలిచి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను దక్కించుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచారు. ఈ అద్భుత విజయంతో దివ్య భారత్ నుంచి గ్రాండ్‌మాస్టర్ (GM) బిరుదు సాధించిన 4వ మహిళగా, అలాగే మొత్తం 88వ భారతీయ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందారు.

Huge prize money for chess champion Divya Deshmukh.. Is it shocking if you know so much?

కోనేరు హంపీపై అద్భుత విజయం

ఫైనల్ మ్యాచ్‌లో దివ్య తన సీనియర్, ప్రపంచ చెస్ చాంపియన్ కోనేరు హంపీని ఓడించడం విశేషం. జార్జియాలోని బటూమిలో జరిగిన ఫైనల్‌లో రెండు క్లాసికల్ గేమ్స్‌ డ్రాగా ముగియడంతో మ్యాచ్‌ టైబ్రేక్‌లకు వెళ్లింది. ఈ టైబ్రేక్‌లలో దివ్య తన అసాధారణ స్ట్రాటజీ మరియు మానసిక ధైర్యంను ప్రదర్శించి 1.5-0.5 స్కోరుతో హంపీపై ఘనవిజయం సాధించారు.

మొదటి ర్యాపిడ్ గేమ్ డ్రా అయినా, రెండో గేమ్‌లో బ్లాక్ పీసులతో ఆడిన దివ్య, అద్భుతమైన ఎండ్గేమ్ స్ట్రాటజీతో హంపీపై విజయం సాధించింది. హంపీ చేసిన కొన్ని చిన్న పొరపాట్లను అనుకూలంగా మలుచుకున్న దివ్య, వరల్డ్ ఛాంపియన్‌గా తన పేరు లిఖించుకుంది.

దివ్య దేశ్‌ముఖ్ నేపథ్యం, విజయ పరంపర

దివ్య దేశ్‌ముఖ్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందినవారు. ఆమె 2005 డిసెంబర్ 9న జన్మించింది. తల్లిదండ్రులు డాక్టర్లు జితేంద్ర దేశ్‌ముఖ్ మరియు నమ్రతా దేశ్‌ముఖ్. చిన్నతనం నుంచే చదరంగం పట్ల ఆసక్తి పెంచుకున్న దివ్య, ప్రొఫెషనల్ కోచింగ్ ద్వారా అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎదిగింది.

దివ్య విజయపరంపర 2023లో ప్రారంభమైంది. ఆమె ఏషియన్ కాంటినెంటల్ విమెన్స్ టైటిల్‌ను సడెన్ రీప్లేస్‌మెంట్‌గా టోర్నీకి వెళ్లి గెలిచింది. తర్వాత టాటా స్టీల్ విమెన్స్ రాపిడ్ సెక్షన్‌లో వరల్డ్ ఛాంపియన్ జు వెన్జున్‌ను ఓడించి టాప్ ప్లేస్‌కి చేరుకుంది. అదే ఏడాది వరల్డ్ అండర్ 20 గర్ల్స్ ఛాంపియన్‌షిప్‌లో 10/11 పాయింట్లతో టైటిల్‌ను గెలిచింది. అంతేకాకుండా ఒలింపియాడ్‌లో మూడు సార్లు గోల్డ్ మెడల్స్ కూడా గెలిచింది.

2021లో ఆమె విమెన్స్ గ్రాండ్ మాస్టర్, 2023లో ఇంటర్నేషనల్ మాస్టర్, 2025లో గ్రాండ్ మాస్టర్ ర్యాంకులు అందుకుంది. ఈ విజయాలన్నీ దివ్య దేశ్‌ముఖ్ కెరీర్‌ను శిఖరాలకు తీసుకెళ్లాయి.

భారీ ప్రైజ్ మనీ వివరాలు

ఈ విజయం దివ్యకు స్వయంచాలకంగా GM టైటిల్ను కూడా అందించింది. విజేత దివ్య దేశ్‌ముఖ్కు $50,000 (సుమారు రూ.41.6 లక్షలు) ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ కోనేరు హంపీకు $35,000 (సుమారు రూ.29.1 లక్షలు) లభిస్తుంది.

2025 ఫిడే మహిళల ప్రపంచకప్‌ మొత్తం ప్రైజ్ పూల్ $691,250 (సుమారు ₹5.75 కోట్లు)గా నిర్ణయించబడింది. ఈ టోర్నమెంట్‌లో 107 మంది ఆటగాళ్లకు వారి ప్రదర్శన ఆధారంగా ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది. క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్న వారికి $14,000 చొప్పున లభిస్తుంది. మొదటి రౌండ్‌లో ఓడిన వారికీ $3,750 చొప్పున చెల్లిస్తారు.

భారత చెస్ భవిష్యత్తుకు నాంది

చదరంగం రంగంలో భారత యువత ఇప్పటికే తమ సత్తా చూపించగా, దివ్య విజయంతో ఇప్పుడు కొత్త జనరేషన్ రైజింగ్ స్టేజ్‌లోకి వచ్చిందని చెస్ అభిమానులు భావిస్తున్నారు. దివ్య విజయం నూతన చెస్ ఛాంపియన్లకు మార్గదర్శిగా నిలిచింది. భారతీయ చదరంగం భవిష్యత్తు ఎంతో వెలుగులు నింపబోతోందనే సంకేతాలను ఈ విజయం ఇచ్చింది.

telugudesk

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

5 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

6 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

14 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

14 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

15 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago