Featured

ఆరువేల కోసం గొడవ పడిన భార్య భర్త.. చివరికి ఏం చేశారంటే?

సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు మనస్పర్థలు రావడం సర్వసాధారణం.అయితే ఇలాంటి గొడవలు వచ్చిన సమయంలో ఎవరో ఒకరు సర్దుకుని ముందుకు వెళితే వారి సంసారం పదికాలాలపాటు పచ్చగా ఉంటుంది.కానీ ప్రస్తుత కాలంలో ఏ చిన్నపాటి గొడవ జరిగినా క్షణికావేశంలో ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకొని బంగారంలాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసాంగికాలనీకి చెందిన కోదండం సాయిలు, పోచవ్వ దంపతులకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది అయితే ఈ దంపతులకు పిల్లలు లేరు. ఈ క్రమంలోనే ఈ దంపతుల మద్య అక్టోబర్ 27వ తేదీ రాత్రి ఆరువేల డబ్బుల విషయంలో గొడవ చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే 28వ తేదీ ఉదయం మరోసారి డబ్బు గురించి గొడవ పడిన భార్య భర్తలు ఆ రోజు సాయంత్రానికి కనిపించకుండా వెళ్లిపోయారు.

ఈ క్రమంలోనే దంపతుల కోసం అన్ని చోట్ల గాలించిన బంధువులు చివరికి మిస్సింగ్ కేసు కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం సాయంత్రం రాజనగర్ ప్రాంతంలోని చర్చి కాలనీలో వీరి మృతదేహాలు బయటపడ్డాయి.

సాయిలు ఒంటికి పట్టించుకోని ఆత్మహత్యకు పాల్పడగా పోచవ్వ పక్కనే ఉన్న కొలనులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే అక్కడ వదిలేసినటువంటి వీరి చెప్పులు, దుస్తులు ఆధారంగా పోలీసులు వీరిని గుర్తించారు. ఇలా చిన్న విషయానికి గొడవపడి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య పెద్దఎత్తున విషాదఛాయలు అలుముకున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago