Prudhvi Raj: కమెడియన్ పృథ్వీ రాజ్ ఎన్నో సినిమాలలో నటుడిగా, కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన ఈయన రాజకీయాల్లోకి ప్రవేశించారు.అయితే ఈయన దురుసు ప్రవర్తన కారణంగా రాజకీయాలలో చేదు అనుభవం ఎదుర్కొని ప్రస్తుతం అధికార పార్టీ నుంచి దూరమైన ఇతను జనసేన పార్టీలోకి వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన పృథ్వీ రాజ్ ఆ పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి కూడా ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాలలో నటించారని చెప్పిన పృథ్వీ రాజ్ తన భార్య పిల్లల గురించి కూడా వెల్లడించారు.ప్రస్తుతం తన భార్య పిల్లలు విజయవాడలో ఉంటున్నారని తాను మాత్రం హైదరాబాద్ లో ఉంటున్నానని తెలిపారు. పిల్లలు లైఫ్ లో సెటిల్ అయ్యారు అయితే గత పది సంవత్సరాల నుంచి తనకు తన భార్యకు,తనకు మధ్య గొడవలు జరుగుతున్నాయని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన తెలిపారు.
ఇక తన భార్యతో తనకు విడాకులు రాకపోయినప్పటికీ ఇద్దరి మధ్య గొడవల కారణంగా కోర్టులో కొన్ని కేసులు నడుస్తున్నాయని పృథ్వీ వెల్లడించారు. ఇక తాను చెన్నైలో ఉన్నప్పుడు తనకు దాసరి పద్మ రేఖ అనే మహిళతో పరిచయం అయ్యింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తాను పద్మ రేఖతో కలిసి ఉంటున్నానని, ప్రస్తుతం తనకంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది పద్మ రేఖ మాత్రమేనని ఆవిడ ఎంతో మంచిదని తనకి ఏ సహాయం కావాలన్నా చేయడానికి ముందుంటారు అంటూ పృథ్వీ చేసిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…