Featured

కారు కొంటా సార్ అని శ్రీకాంత్ తో అంటే.. ముందు ఆ పని చూడు అన్నాడు?

తెలుగు ఇండస్ట్రీలో తన బాధను గానీ, ఇంకెలాంటి ఫీలింగ్‌నైనా పంచుకోవడానికి కొంత మంది తనకు అత్యంత సన్నిహితులున్నారని నటుడు అనంత ప్రభు తెలిపారు. అందులో ముఖ్యంగా శ్రీకాంత్, తరుణ్‌లాంటి వారున్నారని ఆయన అన్నారు. తామంతా క్రికెట్‌ ఆడుతూ ఆడుతూ అలా క్లోజ్ అయ్యామని ప్రభు చెప్పారు.

చిత్ర పరిశ్రమలో అందరితోనూ ఒకలా ఉండలేమని ప్రభు అన్నారు. అలాగే అందరితోనూ అన్ని విషయాలూ షేర్ చేసుకోలేమని, అలా అనిపించేది మాత్రం ఒక్క శ్రీకాంత్‌ గారితోనే అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనకి కూడా తాను నచ్చడం నిజంగా తన అదృష్టమని ఆయన చెప్పారు. అలాగే తరుణ్‌, అల్లరి నరేష్ కూడా తనతో చాలా సాన్నిహిత్యంగా ఉంటారని ఆయన అన్నారు.

కానీ ఎవరితో ఎంత క్లోజ్‌గా ఉన్నా కూడా ఒక లైన్‌ అనేది మెయింటైన్ చేస్తానని ప్రభు చెప్పారు. లేదంటే మొత్త అడ్వాంటేజ్ తీసుకుంటానేమో తానే అని ఆయన తెలిపారు. అయితే ఒకసారి తన వద్దనున్న కారు తీసేసి కొంచెం పెద్ద కారు తీసుకుంటా అన్నపుడు, శ్రీకాంత్ అన్ని వివరాలు అడిగి, చివరికి కొత్త కారు ఎందుకు మళ్లీ ? డబ్బులు ఎందుకు వృథా చేయడం ? వచ్చి ముందు పని చెయ్యి. నువ్వు ఏ కారులో వచ్చావు అనేది ఎవరూ చూడరు. పని చేశావా లేదా అనేది మాత్రమే చూస్తారని ఆయన అన్నట్టు ప్రభు వివరించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…

57 minutes ago

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

1 hour ago

ఫోన్‌తో టాయిలెట్‌లో గడిపితే… మీ శరీరం చెల్లించాల్సిన ధర ఇదే!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…

1 hour ago

టాలీవుడ్‌కు ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ హాట్ టాపిక్

తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…

2 hours ago

కేరళ సీఎంకు లేఖ.. మోనాలిసా కేసులో కొత్త ట్విస్ట్

‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…

2 hours ago

పచ్చదనం మంచిదే కానీ.. ఈ చెట్లకు దూరంగా ఉండండి!

ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…

2 hours ago