Balakrishna: నేను సీఎం జగన్ ను ఎప్పటికీ కలవను.. నా సినిమాకు టికెట్ రేట్లతో పనిలేదు.. బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Balakrishna: సినిమా టికెట్ల విషయంపై టాలీవుడ్ హీరోలు దర్శకనిర్మాతలు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సమావేశానికి కొందరు హీరోలకు ఆహ్వానం అందినా రాలేదని తెలుస్తోంది. అలాంటి వారిలో బాలకృష్ణ కూడా ఒకరు.

Balakrishna: నేను సీఎం జగన్ ను ఎప్పటికీ కలవను.. నాకు ఆ అవసరం లేదు… బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

ముఖ్యమంత్రితో సమావేశం కావడానికి రావాలని ఆయనకు ఆహ్వానం వచ్చినా ఆయన వెళ్లలేదని ఓ సందర్భంలో వెల్లడించారు. తాజాగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ ఈ విషయంపై మాట్లాడారు.

Balakrishna: నేను సీఎం జగన్ ను ఎప్పటికీ కలవను.. నాకు ఆ అవసరం లేదు… బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తనకు సీఎం ఆఫీస్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందని అయినా కూడా నేను తనని కలవడానికి వెళ్లలేదని తెలిపారు. ఇప్పుడే కాదు ఇకపై ఎప్పుడు కూడా సీఎం జగన్ ను కలవననీ నాకు ఆ అవసరం లేదని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు.

అఖండ సినిమా మంచి ఉదాహరణ..

నేను నటించే సినిమాలకు తక్కువ సినిమా టికెట్ల రేట్లు ఉన్నా పర్వాలేదు.. నేను నా సినిమాలను పరిమితికి మించి డబ్బులు ఖర్చు చేయకుండా చూసుకుంటాను. సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పుడు కూడా తాను నటించిన అఖండ సినిమా విజయవంతం అయింది. ఇదే ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. నాకు సినిమా టికెట్ల రేట్లు గురించి అవసరం లేదు కనుక నేను ఇక పై జగన్ ను కలవని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలియచేశారు.