Actress Shiva Parvathi:ఎన్నో తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి శివపార్వతి గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈమె తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా వరుస సినిమాలలో నటించిన ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినిమా విశేషాల గురించి వెల్లడించారు.
ఈ సందర్భంగా శివ పార్వతి మాట్లాడుతూ తమ జీవితాలు సరైన గాడిలో పడటానికి సావిత్రి జీవితం మాకు ఒక గుణపాఠంగా ఉందని ఈమె మహానటి సావిత్రి గురించి గుర్తు చేసుకున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలో తనకు ఎన్నో ప్రేమ లేఖలు వచ్చాయని శివపార్వతి వెల్లడించారు.
ఇక ఏదైనా షూటింగ్ సమయంలో ఇబ్బంది పడిన పరిస్థితులు తలెత్తాయా అని ప్రశ్నించగా ఆమె సమాధానం చెబుతూ బాలకృష్ణ నటించిన ఒక్కమగాడు షూటింగ్ సమయంలో ఒక టెంపుల్ లోపల పాట చిత్రీకరణ జరుగుతుంది. అయితే షూటింగ్ చూడటం కోసం పెద్ద ఎత్తున అక్కడికి గ్రామ ప్రజలు రావడంతో అందరినీ బయటకు పంపించి వేశారు.
ఇలా లోపల మేము ఇరుక్కపోయాము మధ్యాహ్నం మూడు గంటలు దాటిన మాకు భోజనం రాలేదు. ఆకలితో ఎంతో అలమటించాము. కానీ బాలకృష్ణ గారికి మాత్రం నిచ్చెన వేసుకొని గోడ దిగి తనకు మాత్రం భోజనం తీసుకు వచ్చారు. దాదాపు అక్కడ పది మందికి పైగా ఆర్టిస్టులమున్నాము. కానీ అతనికి మాత్రమే భోజనం వచ్చింది అని శివపార్వతి వెల్లడించారు.
ఇక బాలకృష్ణ గారికి క్యారేజ్ రాగానే ఆయన నన్ను పిలిచి నా చేతిలో పెట్టి ఇది అందరికీ సర్దాలి ఎలా పెడతారో పెట్టండని నా చేతుల్లో పెట్టారు.ఆ సమయంలో ఏం చేయాలో దిక్కుతోచక ఆయనకు వచ్చిన భోజనం మొత్తం ఒక గిన్నెలో వేసి కూరలు మొత్తం కలిపి ప్రతి ఒక్కరికి చిన్న చిన్న కప్పులలో భోజనం వడ్డించానని శివ పార్వతి ఈ సందర్భంగా తెలియజేశారు.బాలకృష్ణ గారు తనకు భోజనం రాగానే తన పక్కకు వెళ్లి భోజనం చేయవచ్చు కానీ, ఆయన అలా చేయలేదు అతని మనసు చాలా మంచిది. అందుకే మా అందరి ఆకలి తీర్చారని శివ పార్వతి ఈ సందర్భంగా వెల్లడించారు.
ఉదయం వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. బరువు నియంత్రణ నుంచి గుండె ఆరో్యం వరకు ఎన్నో…
వేసవి కాలంలో ఎండలు పెరిగిపోవడంతో చాలామంది చల్లటి నీళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే…
వేసవి కాలంలో మామిడిపండ్లు అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఇష్టం. రోజూ మామిడి తినకుండా ఉండలేని వారూ ఉంటారు. అయితే…
వేసవి వచ్చిందంటే పిల్లలకు సెలవులు, ఆటలు, సరదాలు మొదలవుతాయి. ఈ సమయంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను స్విమ్మింగ్ క్లాసులకు…
వేసవి కాలం వచ్చిందంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో…
హిందువుల అత్యంత పవిత్ర తీర్థయాత్రల్లో ఒకటిగా భావించే కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. 2026…