Categories: Movie News

Baahubali The Epic : కట్టప్ప చంపకపోతే నేనే చంపేవాడిని.. రానా ఫన్నీ కామెంట్స్!

హైదరాబాద్: టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించిన ఐకానిక్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘బాహుబలి’ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, మేకర్స్ ‘బాహుబలి: ది ఎపిక్’ (BaahubaliTheEpic) పేరుతో రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నారు.

If Kattappa hadn’t killed me, I would have killed him myself: Rana’s funny comments

ఈ రీ-రిలీజ్‌కు సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా బాహుబలి టీమ్ తమ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా అభిమానులనుద్దేశించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న సంధించింది: “ఒకవేళ బాహుబలిని కట్టప్ప చంపకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది?” అని పోస్ట్ చేసింది. దీనికి సినిమాలోని భల్లాలదేవ పాత్రధారి రానా దగ్గుబాటి ఫన్నీగా రిప్లై ఇచ్చారు. “బాహుబలిని కట్టప్ప చంపకపోయి ఉంటే, అతడికి బదులుగా నేను చంపేవాడిని” అంటూ రానా రాసుకొచ్చారు. రానా చేసిన ఈ కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది.

‘ది ఎపిక్’ రన్‌టైంపై రానా స్పందన

అంతేకాకుండా, ‘బాహుబలి: ది ఎపిక్’ రన్‌టైం (BaahubaliTheEpic Runtime) పై కూడా రానా స్పందించారు. “బాహుబలి ఎంత రన్‌టైం ఉన్నా నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏడాది ఏ సినిమా చేయకుండానే రీ-రిలీజ్‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ నమోదు చేస్తాను” అని సరదాగా అన్నారు. రన్‌టైం గురించి తనకు కూడా కచ్చితంగా తెలియదని, తాను కూడా సోషల్ మీడియాలో వచ్చినవి చూస్తున్నానని రానా పేర్కొన్నారు. కొందరు నాలుగు గంటలంటూ పోస్టులు పెడుతున్నారని, దీనిపై దర్శకుడు రాజమౌళి మాత్రమే క్లారిటీ ఇస్తారంటూ రానా చెప్పుకొచ్చారు.

ఈ రీ-రిలీజ్ బాహుబలి అభిమానులకు మరోసారి ఈ భారీ చిత్రాన్ని థియేటర్లలో చూసే అవకాశాన్ని కల్పిస్తోంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago