హైదరాబాద్: టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించిన ఐకానిక్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘బాహుబలి’ మళ్లీ వెండితెరపై సందడి చేయనుంది. ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, మేకర్స్ ‘బాహుబలి: ది ఎపిక్’ (BaahubaliTheEpic) పేరుతో రెండు భాగాలను కలిపి ఒకే సినిమాగా అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేయనున్నారు.

ఈ రీ-రిలీజ్‌కు సంబంధించి చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా బాహుబలి టీమ్ తమ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా అభిమానులనుద్దేశించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న సంధించింది: “ఒకవేళ బాహుబలిని కట్టప్ప చంపకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది?” అని పోస్ట్ చేసింది. దీనికి సినిమాలోని భల్లాలదేవ పాత్రధారి రానా దగ్గుబాటి ఫన్నీగా రిప్లై ఇచ్చారు. “బాహుబలిని కట్టప్ప చంపకపోయి ఉంటే, అతడికి బదులుగా నేను చంపేవాడిని” అంటూ రానా రాసుకొచ్చారు. రానా చేసిన ఈ కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది.
‘ది ఎపిక్’ రన్‌టైంపై రానా స్పందన
అంతేకాకుండా, ‘బాహుబలి: ది ఎపిక్’ రన్‌టైం (BaahubaliTheEpic Runtime) పై కూడా రానా స్పందించారు. “బాహుబలి ఎంత రన్‌టైం ఉన్నా నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏడాది ఏ సినిమా చేయకుండానే రీ-రిలీజ్‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ నమోదు చేస్తాను” అని సరదాగా అన్నారు. రన్‌టైం గురించి తనకు కూడా కచ్చితంగా తెలియదని, తాను కూడా సోషల్ మీడియాలో వచ్చినవి చూస్తున్నానని రానా పేర్కొన్నారు. కొందరు నాలుగు గంటలంటూ పోస్టులు పెడుతున్నారని, దీనిపై దర్శకుడు రాజమౌళి మాత్రమే క్లారిటీ ఇస్తారంటూ రానా చెప్పుకొచ్చారు.
ఈ రీ-రిలీజ్ బాహుబలి అభిమానులకు మరోసారి ఈ భారీ చిత్రాన్ని థియేటర్లలో చూసే అవకాశాన్ని కల్పిస్తోంది.
I would have killed him instead 😡🥂 https://t.co/8oe6qUZP9l
— Rana Daggubati (@RanaDaggubati) July 16, 2025































