Featured

Imandhi Ramarao : సింగర్ సునీత ఏ.ఆర్ రెహమాన్ ను అవమానించిందా?? బాలు సునీత మధ్య బంధం ఇదే..పెళ్లికి ముందు పెళ్లి తరువాత ఎలా ఉందంటే : ఇమంది రామారావు

Imandhi Ramarao : సింగర్ సునీత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అందమైన రూపంతో పాటు అందమైన గాత్రంతో అకట్టుకున్న సింగర్. ఆమె పాటను ఎంత వినసొంపుగా పాడుతుందో అంతే బాగా హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పగలదు. వందల పాటలతో పాటు డబ్బింగ్ కూడా చెప్పిన సునీత వ్యక్తిగత జీవితం మాత్రం అంత మధురంగా సాగాలేదు. చిన్న వయసులో వివాహం అది కాస్తా బెడిసికొట్టి ఆ తరువాత మళ్ళీ పిల్లలను పెద్దవాళ్ళను చేసి ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్న సునీత చాలా ఆనందంగా తన జీవితాని కొనసాగిస్తోంది. ఇక ఆమె జీవిత విశేషాల గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు అయన అభిప్రాయాలను పంచుకున్నారు.

బాలు తో ఎనలేని అనుబంధం…

సింగర్ సునీత చూడటానికి చాలా సుకుమారంగా ఉన్నా చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది, తనజీవితం గురించి చాలా బోల్డ్ సమాధానాలు చెబుతుంది అంటూ ఇమంది గారు చెప్పారు. ఇక ఒకానొక అవార్డు ఫంక్షన్స్ ఏఆర్ రెహమాన్ ను అందరూ ప్రశంసిస్తున్న సమయంలో ఆయన గొప్ప కాదు ఆయన గురువు అంటూ ఇళయరాజా అంతటి వారు లేరు అంటూ చెప్పడం తన ధైర్యానికి నిదర్శనం అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.

అది రెహమాన్ ను కించపరచడం కాదు కేవలం ఇళయరాజా గొప్ప అందరికంటే అని చెప్పడం మాత్రమే అంటూ చెప్పారు. ఇక సింగర్ బాలు కి సునీతకి మధ్య ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు ఇమంది గారు. పాటల పరంగా ఎక్స్ప్రెషన్స్ బాగా పలికించి పాడటంలో బాలు కి ఎవరూ పోటీ లేరు. ఇక సునీత కూడా ఆయనకు ధీటుగా భావాలు పలికిస్తూ పాటపడుతుంది అంటూ చెప్పారు. ఇద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది, సునీత కు బాలు గారంటే చాలా ఇష్టం అలాగే గౌరవం. అదీకాక వాళ్ళు నిజంగా కూడా బంధవులు అవుతారు. ఆయన సునీత కు మావయ్య అవుతారు అంటూ ఇమంది గారు ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago