Imandi Ramarao : ఎన్టీఆర్ ఎలా చనిపోయారు? డాక్టర్ చెప్పిన నిజాల్ని చంద్రబాబు ఎందుకు దాచి పెట్టాడు : ఇమ్మంది రామారావు

Imandi Ramarao : నందమూరి ఇంట ఇటీవలే ఎన్టీఆర్ గారి చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఒక్కసారిగా సినిమా వర్గాలనుండి సాధారణ జనం వరకు అందరూ షాక్ అయ్యారు. అస్థి, హోదా అన్ని ఉండి కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్నలు బయలుదేరాయి. ఇక ఎన్టీఆర్ రామారావు గారి మరణం నుండి ఇప్పటి వరకు చనిపోయిన వారి కుటుంబ సభ్యుల వరకు ప్రతి సంఘటన గురించి వివరించారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు.

ఎన్టీఆర్ గారి మృతి పై అనుమానాలు ఉన్నాయి…

ఎన్టీఆర్ గారు మరణించడానికి కొద్ది సమయం ముందు ఆయన నాగేశ్వరావు గారితో మాట్లాడారు, కలవాలి అని అడిగితే ఉదయం మాట్లాడుదాం అనుకున్నారు అలా కలిసినా ఆయన మరణించేవారు కాదు. ఇక ఉదయం హరికృష్ణ ఇంటికి వెళ్లాలకున్నారు అలా వెళ్లి ఉన్నా వేరేగా ఉండేది కానీ అలా జరుగలేదు. ఆయన చనిపోక ముందు మూడు గంటలు చాలా కీలకం అంటూ ఇమ్మంది గారు అభిప్రాయ పడ్డారు. ఇక ఆయన చనిపోయక పోస్టుమార్టం లో అనుమానస్పదంగా ఉంది అంటూ డాక్టర్ కుసుమ చెప్పారు.

ముఖం నీలంగా మారిపోయిందని, ఏవైనా మాదక ద్రవ్యాలు, లేక స్లో పాయిజన్ లాంటివి ప్రయోగిస్తేనే ఇలా జరుగుతుంది అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు, చాలా మంది దేవుడిగా పూజించే అలాంటి వ్యక్తి మరణం కి సంబంధించి ఇలాంటివి బయటకు వస్తే ఆయన పరువు ఏం కావాలి అంటూ దాచిపెట్టారు. అలా కాకుండా ఆరోజు నిజాలు బయటికి వచ్చుంటే కొంతమంది బతుకులు బయటికి వచ్చేవి అని చెప్పారు ఇమ్మంది. ఇలాంటి నిజాలు ఇప్పుడు మాట్లాడటానికి నేనేమి భయపడను అంటూ వాఖ్యణించారు. ఇక నందమూరి ఇంటికి ఏదో శాపం ఉంది ఆ శాప గ్రస్తులందరు అలా అకాల మరణం చెందుతున్నారు అంటూ కామెంట్స్ చేసారు.