అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది అమెరికాలో స్థిరపడాలని భావించే భారతీయులకు, ఎన్నారై లకు పిడుగులాంటి వార్తే.. ఇమిగ్రేషన్ రద్దు చేస్తున్నట్టు అయన ప్రకటించారు. అమెరికన్లను కాపాడుకోవడానికే తానూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయన పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో అనేక మంది స్థానికులకు ఉద్యోగాలు పోతాయని భావించిన డోనాల్డ్ ట్రంప్. తాజాగా తాత్కాలికంగా ఇమిగ్రేషన్ పాలసీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
“కనిపించని శత్రువు దాడి చేస్తోంది. దాన్ని కరోనా వైరస్ అనిపిలుస్తున్నారు. గ్రేట్ అమెరికన్ పౌరుల ఉద్యోగాలను కాపాడాల్సిన అవసరం ఉంది.” అంటూ ట్రంప్ ట్వీట్ చేసారు. కాగా అమెరికాలో రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 8 లక్షకు పైగా పాజిటివ్ కేసులు చేరుకోగా.. రానున్న రెండు మూడు రోజుల్లో మరణాల సంఖ్య 50 వేలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ నష్ట నివారణ చర్యలు తీసుకునే పనిలో పడ్డారు.
నాలుగేళ్ళ క్రిందట ట్రంప్ ఇలానే ఇమిగ్రేషన్ రద్దు ప్రకటనతో అమెరికన్లను రెచ్చగొట్టి అధ్యక్షుడిగా గెలుపొందారు. అదే సమయంలో ముస్లింలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ముస్లింలు అమెరికాకు రావడాన్ని పూర్తిగా బ్యాన్ చేయాలనీ వ్యాఖ్యానించారు. మళ్ళీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో మరోసారి ఇమిగ్రేషన్ అస్త్రాన్ని ట్రంప్ వాదేసుకున్నరనే భావన చాలా మందిలో నెలకొంది.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…