శివ శంకర్ మాస్టర్ జాతకంలోనే అలా ఉందట.. అసలు ఏం జరిగింది?

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వందల చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శివ శంకర్ మాస్టర్ మృతి చెందడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇదిలా ఉండగా శివ శంకర్ మాస్టర్ వ్యక్తిగత విషయానికి వస్తే..

శివ శంకర్ మాస్టర్ కు చిన్నప్పుడే వెన్నెముకకు గాయం కావడంతో ఆయనకు అందరితో పాటు కలిసి ఆడుకునే అవకాశం లేకపోవడంతో ఆయనను ఇంట్లో ఎంతో గారాబంగా పెంచారు. శివశంకర్ కు పాటలు నాట్యం అంటే ఎంతో ఇష్టం ఉండటం వల్ల సభ అనే సాంస్కృతిక కార్యక్రమానికి తన డ్రైవర్ తో పాటు శివ శంకర్ మాస్టర్ ను పంపించేవారు.

ఇలా అక్కడ పాటలు డాన్సులు చూసి వాటిపై ఎంతో ఇష్టతను పెంచుకున్న మాస్టర్ పదహారు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయనకు వెన్ను నొప్పి తగ్గడంతో తనే సొంతంగా డాన్స్ నేర్చుకుని ట్రూప్ ల వెంట వెళ్లి డాన్స్ చేసేవారు. ఈ విషయం తన తండ్రికి తెలియడంతో ఇంట్లో ఇతనిని తిట్టారు.ఇక శివ శంకర్ మాస్టర్ జాతకాన్ని తీసుకొని ప్రముఖ జ్యోతిష్యలను సంప్రదించడంతో ఆయన జాతకంలో డాన్సర్ అవుతారు మీరు వదిలేయండని పండితులు చెప్పారట.

తన జాతకంలో ఇలా ఉండే సరికి తన తండ్రి మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద శివశంకర్‌ వద్ద డాన్స్ నేర్చుకుని సలీమ్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన తెలుగు తమిళ భాషలలో సుమారు ఎనిమిది వందల చిత్రాల్లో నృత్య దర్శకుడిగా పని చేశారు.అలాగే మగధీర సినిమాలోని ధీర ధీర అనే పాటకు నంది అవార్డును కూడా అందుకున్నారు. అదేవిధంగా 4 తమిళ ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. ఈయన కేవలం కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి అందరినీ మెప్పించారు.