బిగ్ బాస్ కార్యక్రమం 12 వారాలు పూర్తి చేసుకొని ఎవరు ఊహించని విధంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి రవిని ఎలిమినేట్ చేస్తూ అందరికి షాక్ ఇచ్చారు. ఇకపోతే ముందుగానే సోషల్ మీడియాలో 12వ వారం రవి ఎలిమినేట్ అవుతారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రవి ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల విషయంలో ఎంతో ఎనర్జిటిక్ గా టాస్క్ లను పూర్తి చేస్తూ ఉన్నటువంటి రవి టాప్ త్రీ కంటెస్టెంట్ గా నిలుస్తారని ప్రతి ఒక్క ప్రేక్షకులు భావించారు. అలాంటి టాప్ త్రీ కంటెస్టెంట్ ఉన్నఫలంగా ఎలిమినేట్ కావడంతో రవి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలోనే బయట ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రవికి ఓట్లు తక్కువ పడ్డాయి అంటే నమ్మశక్యంగా లేదని వాదిస్తున్నారు.
మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ హౌస్ లో ఫేక్ ఎలిమినేషన్ జరిగిందని రవి ఎలిమినేషన్ వెనుక పెద్ద కుట్ర జరిగిందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఎలిమినేషన్ వెనుక ఎలాంటి కుట్ర లేకపోతే రవికి వచ్చిన ఓట్లు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.
రవి హౌస్ లో ఉన్నటువంటి సిరి, కాజల్, ప్రియాంక కన్నా ఎంతో అద్భుతంగా ఆడతారని అలాంటిది వారు సేఫ్ అయ్యి రవి ఎలిమినేషన్ కావడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.కావాలనే లేడీ కంటెస్టెంట్ లను సేవ్ చేస్తూ రవిని బయటకు పంపారని, రవి లేని బిగ్ బాస్ కార్యక్రమం మేము చూడము అంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…