This is Team India's final squad for the second Test!
భారత్ vs ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతోంది. తొలి టెస్ట్ లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తీవ్ర పరాజయం ఎదుర్కొంది. ఫీల్డింగ్‌లో తప్పిదాలు, బౌలింగ్ విఫలం కావడంతో భారత్ తొలి టెస్టులో ఓటమిపాలైంది. ఇప్పుడు రెండో టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఈ రోజు (జూన్ 22) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్ – ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్‌తో ఆరంభించనుంది. ఇదిలా ఉండగా, బుమ్రా ఈ మ్యాచ్ నుంచి దూరమవడం టీమిండియాకు గట్టి షాక్ తగిలింది..
ఫస్ట్ టెస్టులో ఫైవర్ తీసి ఆకట్టుకున్న బుమ్రా.. పని భారం కారణంగా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్నట్టు సమాచారం. మొదటి టెస్ట్‌లో ప్రదర్శన బాగుండడం వల్ల రెండో టెస్టులో కూడా అతడి సేవలు అవసరమని భావించారు అభిమానులు. కానీ అతడి గైర్హాజరీ టీమ్‌ఇండియా బలాన్ని కొంతవరకు దెబ్బతీసే అవకాశముంది.
ఈ మ్యాచ్ కోసం భారత జట్టు మూడు కీలక మార్పులు చేసింది. బుమ్రాను విశ్రాంతికి పంపిన భారత్… వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్‌లకు ఛాన్స్ ఇచ్చింది. ఇది యువ ఆటగాళ్లకు మంచి అవకాశం కాగా, జట్టులో బ్యాలెన్స్‌ను ఎలా కాపాడతారో చూడాల్సి ఉంటుంది.
ఫైనల్ టీం ఇండియా జట్టు: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
బుమ్రా లేకుండా భారత్ బౌలింగ్ దళం ఎలా రాణిస్తుందో చూడాలి. యువ బౌలర్లు ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారో కీలకం. వరుసగా రెండో మ్యాచ్ కూడా కోల్పోతే సిరీస్‌పై ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఈ మ్యాచ్ భారత్‌కు తప్పనిసరిగా గెలవాల్సిన పోరాటంగా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…