భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీతో పాటు ఎందరో మహానుభావులు పోరాడి.. 1947 ఆగస్టు 15 బానిస సంకెళ్లను తెంచి స్వాతంత్య్రాన్ని సాధించారు. అయితే ఆ సమయంలో ప్రతీ భారతీయుడు ఎంతో సంబరాలను జరుపుకున్నారు. కానీ ఆ సంబరాలలో మహాత్మాగాంధీ మాత్రం పాల్గొనలేదు.
దీనికి గల కారణం ఏంటంటే.. సరిగా 1947 ఆగస్టు 15న గాంధీ హిందూ, ముస్లిం మధ్య మత ఘర్షణలు జరుగుతుంటే.. వాటిని అడ్డుకోవడానికి దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోవాఖలీకి వెళ్లారు. స్వాతంత్ర్య దినోత్సవంలో మీరు పాల్గొనాలంటూ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ గాంధీకి లేఖ రాశారు. అయితే దానికి స్పందించిన మహాత్మాగాంధీ కలకత్తాలోని హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలను.
ఈ ఘర్షణలు ఆపడానికి నేను నా ప్రాణాలైనా ఇస్తా అని అక్కడే ఉన్నారు. అంతే కాకుండా జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగాన్ని ఆగస్టు 14 న అర్థరాత్రి ప్రస్తుత రాష్ట్రపతి భవనం నుంచి ఇచ్చారు. అప్పట్లో రాష్ట్రపతి భవనంను వైస్రాయ్ లాంజ్ అనేవారు.
నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది.. కానీ, గాంధీ ఆరోజు 9 గంటలకే నిద్రపోయారు. 1947 ఆగస్టు 15న లార్డ్ మౌంట్‌బాటన్ తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను అందించారు. తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…