Categories: FeaturedMovie News

ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా గురించి నమ్మలేని నిజాలు…..

ప్రభుదేవా….. కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. డాన్సర్ గా, ఒక కొరియోగ్రాఫర్ తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో అనేక చిత్రాలకు పనిచేశారు. కొరియోగ్రాఫర్ గా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. “చికు బుకు చికు బుకు రైలే..” అంటూ ఇండియన్ సినిమాలో డ్యాన్స్ అనే పదానికి సరికొత్త అర్థం చెప్పాడు ప్రభుదేవా. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో అవార్డులు అందుకున్న ప్రభుదేవా వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుకులను ఎదుర్కొన్నాడు. అలాంటి ప్రభుదేవా గురించి ఎవ్వరికి తెలియని విషయాలు మీ కోసం…

ప్రభుదేవా…..1973 ఏప్రిల్ 3న మైసూరులో జన్మించాడు. ఈయన తల్లి పేరు మహదేవమ్మ, తండ్రి ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్. ప్రభుదేవా ది డాన్స్ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి సుందరం మాస్టర్ కూడా మంచి కొరియోగ్రాఫర్. ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. ఇంకా ప్రభుదేవా ఇద్దరు సోదరులు కూడా సోదరులు రాజ్ సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా డ్యాన్స్ మాస్టర్లు కావడం విశేషం.

కానీ కుటుంబంలో ఎవ్వరికి రానీ పేరు ప్రభుదేవాకు మాత్రమే వచ్చింది. కానీ ప్రభుదేవాకు చిన్నతనంలో డాన్స్ అంటే అంతగా నచ్చేది కాదట. ఫుట్ బాల్ అంటే ఎక్కువ ఇష్టముండేదట. దీంతో ఎక్కువ సమయం పుట్ బాల్ ఆటతోనే గడిపేవాడు. దీంతో తండ్రి సుందర మాస్టర్ డాన్స్ గురించి వివరించడట. ఆయన ప్రేరణతో డాన్స్ లోకి అడుగుపెట్టిన ప్రభుదేవా చిన్నప్పుడే భరత నాట్యం, వెస్ట్రన్ డాన్స్ నేర్చుకున్నాడు. అయితే ఆ కాలంలోనే ప్రభుదేవా స్టెప్పులు చూసిన వారంతా పెద్దవాడు అయ్యాక ఇండియన్ మైఖేల్ జాక్సన్ వి అవుతావని మెచ్చుకునేవారంట. అలా ప్రభుదేవా చిన్నప్పటి నుంచి డాన్స్ తోనే పెరిగాడు.

ఆ తర్వాత 1989లో కమల్ హాసన్ నటించిన వెత్రి విజా సినిమా ద్వారా కొరియోగ్రాఫర్ గా చిత్రం రంగంలోకి అడుగుపెట్టాడు. అప్పుడు ప్రభుదేవా వయస్సు కేవలం 16 ఏళ్ళు. అలా కొరియోగ్రాఫర్ గా కేరీర్ ను ప్రారంభించిన ప్రభుదేవా సక్సెస్ అయ్యాడు. బాలీవుడ్ లో కూడా రాణించాలకున్న ప్రభుదేవాకు అమితాబచ్చన్ తో కలిసిన పనిచేయ్యాలని ఉండేది. దాన్ని కల కూడా నెరవేర్చుకున్నాడు. అంతేకాదు అక్కడి స్టార్ హిరోలతో కూడా స్టెప్పులు వేయించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హిరోలతో కూడా స్టెప్పులు వేయించాడు.

ఇప్పటికీ కొరియోగ్రాఫర్ గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ప్రభుదేవా కేవలం కొరోయోగ్రాఫర్ గానే ఉండిపోలేదు. యాక్టింగ్ కూడా చేశారు. 1994లో వచ్చిన “ఇందు” అనే చిత్రం ద్వారా వెండితెరకు నటుడిగా పరిచమయ్యాడు. పవిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రోజా హిరోయిన్ గా నటించారు. అప్పుడే తనలో ఉన్న నటుడు బయటకు వచ్చాడు. తన యాక్టింగ్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆయన మొదటి చిత్రానికే నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. అనంతరం పలు భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు.

అంతేకాదు డైరెక్టర్ గా కూడా తన సత్తా చాటుకున్నాడు ప్రభుదేవా. ఆయన డైరెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమా “నువ్వొస్తానంటే నేనొద్దంటానా…” సూపర్ డూపర్ హిట్ అయిన…..ఈ చిత్రానికి 9 ఫిలింఫేర్ అవార్డులు, 5 నంది అవార్డులు వచ్చాయి.

ప్రభుదేవా కేరీర్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టిన పాట మాత్రం ముక్కాబులా ముక్కాబులా సాంగ్. ఈ పాట అప్పట్లో ఒక సెన్సెషన్ క్రియేట్ చేసింది. మళ్లీ అదే సాంగ్ ను స్ట్రీట్ డాన్సర్ సినిమాలో పెట్టి కొత్త స్టెప్పులు వేయించారు. హిందీలో కూడా ముక్కాబులా ముక్కాబులా సాంగ్ మంచి సక్సెస్ ను అందుకుంది. ఇండియన్ డాన్స్ కి కింగ్ అయిన ప్రభుదేవా డాన్స్ మాస్టర్ గా ఎన్నో నంది, ఫిల్మ్ ఫెర్, సైమా, అవార్డులను అందుకున్నాడు. రెండు జాతీయ అవార్డులను అందుకున్నాడు.

సినిమా రంగానికి ప్రభుదేవా అందిస్తున్న సేవాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రభుదేవాకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదగా మన ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ అవార్డును అందుకున్నారు. కేరీర్ పరంగా ఎంతో సక్సెస్ ను అందుకున్న ప్రభుదేవా వ్యక్తి గత జీవితంలో మాత్రం కొన్ని వివాదాలను ఎదుర్కొన్నాడు.

హిరోయిన్ నయనతారతో ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు నయనతారను పెళ్లి చేసుకోవడం కోసం తన భార్యకు విడాకులు ఇచ్చాడని… కానీ విడాకుల తర్వాత కూడా ప్రభుదేవా ఎక్కువగా మాజీ భార్య పిల్లలనే చూస్తున్నాడనే కారణంతో నయన్, ప్రభుదేవాతో పెళ్లి కాన్సిల్ చేసుకుందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందనేది ఎవ్వరికి తెలియదు. ఈ పుకార్ల పై నయనతారగాని ప్రభుదేవా కాని నోరు విప్పలేదు.

ఆ సమయంలో మాత్రం ప్రభుదేవా కుటుంబంలో అనేక గొడవలు జరిగాయని అతని గురించి బాగా తెలిసిన వారు చేబుతుంటారు. అలా కొన్నాళ్ళు ప్రభుదేవా వ్యక్తిగతంగా సఫర్ అవ్వాల్సి వచ్చింది. అయిన కూడా డాన్సర్ గా ఏ మాత్రం డౌన్ కాకుండా ఇంకా నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు ప్రభుదేవా.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago