కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్యరంగాలతో పాటుగా వైన్స్ షాపులు కూడా మూతపడ్డాయి. అయితే ఒక వైపు మద్యం దొరక్క మందుబాబులు నానా అవస్థలు పడుతున్నా.. మద్యం షాపులు తెరవడానికి మాత్రం ససేమిరా అంటుంది తెలంగాణా ప్రభుతం. అయితే మందు చుక్క దొరక్క కొందరు పిచ్చెక్కి ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరుతున్నారు. మరికొందరు ఆత్మహత్యలు సైతం పాల్పడుతున్న సంగతి మనకు తెలిసిందే.. అయితే ఇంకొందరు మాత్రం ఇదే అదునుగా చూసుకుని మద్యం చోరీలకు పాల్పడుతున్నారు. ఇటువంటి సంఘటనే ఒకటి హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వైన్ షాపులో జరిగింది.
మద్యం షాపు మూసివేసి ఉండటంతో మద్యం షాపు వెనుక భాగంలో రంద్రం పెట్టి లోపలకు చొరబడి సుమారు రూ. లక్ష రూపాయిల విలువైన మద్యం బాటిళ్లను దోచుకెళ్లారు. అదే క్రమంలో షాపులో ఉన్న కొంత నగదు కూడా ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఈ తతంగం అంతా ఆ షాపులో ఉన్న సిసి కెమెరాలో రికార్డ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. అతి త్వరలో ఈ మద్యం దొంగలను పట్టుకుంటామని పొలుసులు చెబుతున్నారు.
కర్ణాటకలో కూడా ఇదేవిధమైన చోరీ జరిగినట్టు తెలిసింది. మంగుళూరు సమీపంలోని ఉల్లాల్ పట్టణంలో ఒక వైన్స్ లో చొరబడి సుమారు లక్ష విలువైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దీనిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తూన్నారు అక్కడి పోలీసులు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…