కరోనా మహమ్మారి విలయతాండవం కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో 21రోజుల పాటు రైళ్లను నిలిపివేయడం జరిగింది. అయితే ఏప్రిల్ 15 నుంచి రైళ్లు తిరిగి ప్రారంభం అవుతున్నాయని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఇదే విషయాన్నీ కొన్ని మీడియా ఛానళ్ళలోకూడా ప్రసారం చేసారు. అంతేకాకుండా రైళ్ల శాఖ రైళ్లను పునఃప్రారంభిస్తున్నారని, ఉద్యోగులను తమ తమ విధులకు హాజరుకావాలంటూ పిలుపునిచ్చిందని కూడా వార్తలు జోరుగా వచ్చాయి. అయితే దీనిపై కీలక ప్రకటన చేసింది రైల్వే మినిస్ట్రీ.
“లాక్ డౌన్ తరువాత నుంచి రైళ్లు నడిపే అంశంపై రైల్వే శాఖ నిర్ణయం తీసుకోదంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ప్రయాణికుల రైళ్లను నడిపే అంశంపై ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనను రేల్వే శాఖ జారీ చేయలేదు. దీనికి సంబంధించిన ఏ విషయాన్నీ అయినా రైల్వే శాఖ సంబంధిత వర్గాలకు ముందుగా తెలియజేస్తుంది ” అంటూ రైల్వే మినిస్ట్రీ ట్వీట్ చేసింది.
ట్రైన్ బుకింగ్స్ పైన కూడా అధికారులు క్లారిటీ ఇచ్చారు. రైల్వే టిక్కెట్ల బుకింగ్ ప్రక్రియ ఎప్పుడు నిలిచిపోలేదని స్పష్టం చేసారు. రైల్వే శాఖ నిబంధనల ప్రకారం 120 రోజుల ముందే ట్రైన్ టిక్కెట్ల రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ముందు నుంచే ఉందని, కేవలం లాక్ డౌన్ అమలులో ఉన్న మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 తేదీల వరకు జరిగే ప్రయాణాలకు మాత్రమే రద్దు చేయడం జరిగిందని స్పష్టం చేసింది. వేసవి సెలవుల దృష్ట్యా ఇప్పటికే మూడు నెలల ముందే అడ్వాన్స్ రిజర్వేషన్లు భారీ సంఖ్యలో జరిగాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుతం స్పష్టత ఇచ్చిన తరువాతే తాము ఒక నిర్ణయం తీసుకుంటామని రేల్వే శాఖ తెలిపింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…