ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న కారణంగా మన దేశం మొత్తం లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన సర్వీసులను ఏప్రిల్ 30 వరకు నిలిపివేయనున్నట్టు తెలిపింది. దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సర్వీసులు సైతం నడపడరాదని ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది. అయితే ఏప్రిల్ 14 తో మన దేశంలో లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
మరో పక్క ఇండిగో, స్పైస్ జెట్ మరియు గోఎయిర్ విమానయాన సంస్థలు మాత్రం డొమెస్టిక్ విమాన సర్వేసులను నడిపేందుకు ఏప్రిల్ 15నుంచి టిక్కెట్ బుకింగ్స్ ప్రారంభించాయి. ఇప్పటికే పలువురు ప్రయాణికులు సైతం ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్నట్టు సమాచారం. అయితే అంతర్జాతీయ విమాన సర్వేసులను మాత్రం మే 1 నుంచి ప్రారంభించాలని విమానయాన సంస్థలు యోచిస్తున్నాయి.ఏప్రిల్ 15 నుంచి దేశీయ విమానాలు, మే 1 నుంచి అంతర్జాతీయ విమానాలను నడుపుతామని స్పైస్ జెట్, గో ఎయిర్ విమాన సంస్థల అధికార ప్రతినిధులు ప్రకటించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో విమానయాన సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయం సంచలంగా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…