రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వాట్సాప్ ద్వారా కొత్త సర్వీసులు..?

రైల్వే శాఖ భారతదేశంలోని రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. తరచూ రైలు ప్రయాణాలు చేసే వాళ్ల కోసం కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. రైలోఫీ అనే సంస్థ అందుబాటులోకి తెచ్చిన ఈ సర్వీసుల వల్ల రైలు ప్రయాణికులు రియల్ ట్రైమ్ పీఎన్ఆర్ స్టేటస్ ను తెలుసుకోవడంతో పాటు రైలు ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.

వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసులను పొందే అవకాశం ఉండటంతో కస్టమర్లు సులువుగా ప్రయాణించే రైలుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అరచేతిలో స్మార్ట్ ఫోన్ తో పీఎన్ఆర్ స్టేటస్, అప్‌కమింగ్ రైల్వే స్టేషన్, ప్రీవియస్ రైల్వే స్టేషన్, లైవ్ ట్రైన్ స్టేటస్ తో పాటు ఇతర సమాచారాన్ని కూడా సులువుగా పొందవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్‌ కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పొందడంతో పాటు రైలు ఆలస్యమయ్యేలా ఉంటే ఆ వివరాలు కూడా తెలుస్తాయి.

రైలోఫీ తెచ్చిన ఈ సర్వీసుల వల్ల రైలు ప్రయాణికులకు భారీగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. అయితే ఈ సర్వీసులు పొందాలంటే వాట్సాప్ కస్టమర్లు ఖచ్చితంగా యాప్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. +91 – 9881193322 ఫోన్ నంబర్ ను మొబైల్ లో సేవ్ చేసుకుంటే ఈ సర్వీసులను సులభంగా పొందవచ్చు. నంబర్ ను సేవ్ చేసుకున్న తరువాత పీఎన్ఆర్ నెంబర్‌ ను ఎంటర్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది.

ఆ తరువాత వాట్సాప్ నంబర్ కు ఎప్పటికప్పుడు రైలు సర్వీసులకు సంబంధించిన పూర్తి వివరాలు సందేశాల రూపంలో వస్తూ ఉంటాయి. ఎక్కువగా రైలు ప్రయాణాలు చేసే వాళ్లు ఈ సర్వీసులను వినియోదించడం వల్ల రైలు ప్రయాణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావని చెప్పవచ్చు.