రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. డిజిటల్ పేమెంట్స్ ను దేశవ్యాప్తంగా పెంచాలనే ఉద్దేశంతో క్రెడిట్, డెబిట్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ద్వారా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజర్లకు ప్రయోజనం చేకూరుతోంది. కాంటాక్ట్‌లెస్ కార్డుల లావాదేవీల పరిమితిని పెంచుతున్నట్టు ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది.
ఆర్బీఐ చేసిన ఈ ప్రకటన వల్ల ఇప్పటివరకు కాంటాక్ట్ లెస్ కార్డుల లావాదేవీల పరిమితి 2,000 రూపాయల నుంచి ఏకంగా 5,000 రూపాయలకు పెరిగింది. 5,000 రూపాయల వరకు ఇకపై పిన్ ఎంటర్ చేయకుండానే కాంటాక్ట్ లెస్ లావాదేవీలు జరిపే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పిస్తోంది. పిన్ ఎంటర్ చేసే అవసరం లేకపోవడంతో సులభంగానే లావాదేవీలు జరిపే అవకాశాన్ని ఆర్బీఐ కల్పిస్తోంది.
ఆర్బీఐ కొత్త నిబంధనలు జనవరి నెల 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలు సైతం కాంటాక్ట్ లెస్ లావాదేవీలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. బ్యాంకులు సైతం కస్టమర్లకు కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను జారీ చేస్తుండటం గమనార్హం. మరోవైపు ఆర్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి మరో శుభవార్త చెప్పింది.
ఆర్‌టీజీఎస్ లావాదేవీలను రోజంతా నిర్వహించుకునే సౌకర్యాన్ని ఆర్బీఐ కల్పిస్తోంది. రెండు లక్షలకు పైగా పైగా లావాదేవీల కోసం ఆర్టీజీఎస్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…