రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. డిజిటల్ పేమెంట్స్ ను దేశవ్యాప్తంగా పెంచాలనే ఉద్దేశంతో క్రెడిట్, డెబిట్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ద్వారా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజర్లకు ప్రయోజనం చేకూరుతోంది. కాంటాక్ట్‌లెస్ కార్డుల లావాదేవీల పరిమితిని పెంచుతున్నట్టు ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది.

ఆర్బీఐ చేసిన ఈ ప్రకటన వల్ల ఇప్పటివరకు కాంటాక్ట్ లెస్ కార్డుల లావాదేవీల పరిమితి 2,000 రూపాయల నుంచి ఏకంగా 5,000 రూపాయలకు పెరిగింది. 5,000 రూపాయల వరకు ఇకపై పిన్ ఎంటర్ చేయకుండానే కాంటాక్ట్ లెస్ లావాదేవీలు జరిపే అవకాశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పిస్తోంది. పిన్ ఎంటర్ చేసే అవసరం లేకపోవడంతో సులభంగానే లావాదేవీలు జరిపే అవకాశాన్ని ఆర్బీఐ కల్పిస్తోంది.

ఆర్బీఐ కొత్త నిబంధనలు జనవరి నెల 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలు సైతం కాంటాక్ట్ లెస్ లావాదేవీలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. బ్యాంకులు సైతం కస్టమర్లకు కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను జారీ చేస్తుండటం గమనార్హం. మరోవైపు ఆర్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి మరో శుభవార్త చెప్పింది.

ఆర్‌టీజీఎస్ లావాదేవీలను రోజంతా నిర్వహించుకునే సౌకర్యాన్ని ఆర్బీఐ కల్పిస్తోంది. రెండు లక్షలకు పైగా పైగా లావాదేవీల కోసం ఆర్టీజీఎస్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here