‘హ్యాపీడేస్’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన యంగ్ హీరో వరుణ్ సందేశ్ ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఈ చిత్రాలతో ఎంత పెద్ద ఫేమ్ తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రెండు సినిమాలతో ఎంతగానో యువతను ఆకట్టుకున్న వరణ్ సందేశ్ తాజాగా ఇందువదన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తాజా ఈ మూవీ టీజర్ ను దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు విడుదల చేశారు. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టుగా తాజా టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై బాగానే అంచనాలను పెంచుతోంది. ఈ సినిమాలో వరుణ్ సందేశ్‌కి జంటగా ఫర్నాజ్ శెట్టి నటిస్తుండగా, ఎమ్మెస్సార్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ.. వైవిధ్యమైన కథతో అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో తెరకెక్కిన చిత్రం ‘ఇందువదన’.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. మా తాతయ్య తన సినిమాలను చూడాలని బాగా పరితపించేవాడని.. కానీ గత ఏడాది చనిపోయాడంటూ వాపోయాడు. అలా తన తాతయ్య కోరికను నెరవేర్చలేదన్న బాధ ఉందంటూ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా చాలా బాగా వచ్చిందని.. ఈ సినిమాలో తొలిపాట యూట్యూబ్ లో విడుదల చేయడంతో మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీనికి శివ కాకాని సంగీతం అందిస్తున్నారు. రఘుబాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, తాగుబోతు రమేశ్, ధన్‌రాజ్, మహేశ్ విట్టా తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…