కరోనా కారణంగా కొన్ని పరిశ్రమలు మూత పడగా.. మరి కొన్ని పరిశ్రమలు లాభాల భాటలో పయనిస్తున్నాయి. అందులో ఫుడ్ ఆధారిత పరిశ్రమలు అయితే లాక్‌డౌన్ వల్ల పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోవడం, సిబ్బంది లేకపోవడం వల్ల ఎక్కడి ఉత్పత్తి అక్కడే ఆగిపోయాయి. దీంతో ఫుడ్ పరిశ్రమలకు భారీగా నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం పలు ఫుడ్ పరిశ్రమలు తమ ఉత్పత్తులపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
తాజాగా బ్రిటానియా కూడా క్రమంగా తన ఉత్పత్తుల ధరలను పెంచాలని నిర్ణయించింది. గతేడాది అంటే జూన్ 30, 2020తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రెండింతలై రూ.542.68 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.248.64 కోట్లు మాత్రమే.
మొత్తం ఆదాయం సైతం 26.97 శాతం వృద్ధితో రూ.2,767.8 కోట్ల నుంచి రూ.3,514.35 కోట్లకు చేరుకుంది. ప్రస్తతం కరోనా కారణంగా జూన్ త్రైమాసికం గడ్డుకాలంగా మారింది. లాక్‌డౌన్ వల్ల పలు ఇబ్బందులు తలెత్తాయి. దేశవ్యాప్తంగా ప్లాంట్లు, డిపోలు, రవాణా, వెండార్లకు సంబంధించిన సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది.
ఇపుడు తిరిగి కరోనా పూర్వపు స్థాయికి పంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తున్నామని సంస్థ ఎంపీ వరుణ్ బెర్రీ తెలిపారు. అందుకే ధరలను పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2 శాతం ఈ కామర్స్ వ్యాపారాన్ని 5 శాతానికి పెంచుకోవాలని బ్రిటానియా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…