Featured

Inspector Bendi Venkatarao : మేము ఇంటికి వెళ్లి చూస్తే… ఆ అమ్మాయి ఒక్కరోజు కూడా… మానసికంగాను, శరీరకంగాను చిత్ర హింసలు..: ఇన్స్పెక్టర్ బెండి వెంకటరావు

Inspector Bendi Venkatarao : విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన న్యాయవాది వృత్తి చేస్తున్న గోదావరి మధుసూదన్ అనే వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఏళ్ళు తన భార్యను చీకటి గదికి పరిమితం చేసాడు. పుట్టపర్తి కి చెందిన సాయి సుప్రియ అనే మహిళను 2008లో వివాహం చేసుకున్న గోదావరి మధుసూదన్ ఆమెను ఏకంగా 13 ఏళ్లుగా చీకటి గదికి పరిమితం చేసారు. కోర్ట్ సహాయంతో పోలీసులు ఆమెను నేడు విడుదల చేయగా 13 ఏళ్ల తరువాత ఆమె మొదటి సారి వెలుతురు చూసింది. ఇంత శాడిస్ట్ గా ఉన్న మధుసూదన్ రావు అతని కుటుంబం ఈ ఘటన మీద సమర్తించుకోవడం ఆశ్చర్యకరమైన విషయం.

మేము ఇంట్లోకి వెళ్లేసరికి…

దాదాపు 13 ఏళ్లుగా కూతురు ఎలా ఉందో తెలియక అల్లాడిన సాయి సుప్రియ తల్లిదండ్రులు చివరకు ఆమెను చూపించాలని కోర్ట్ ను ఆశ్రయించారు. అలా పోలుసులు, మహిళా శిశు సంక్షేమ అధికారులు, స్థానిక విఆర్ఓ సహాయంతో పోలీసులు మధుసూదన్ ఇంటిని తనిఖీ చేయగా సాయి సుప్రియ ఒక చీకటి గదిలో ఉండటం చూసారు. ఆమె బాగా బలహీనంగా ఉంది అంటూ ఇన్స్పెక్టర్ బెండి వెంకటరావు గారు తెలిపారు.

బయటకు ఆమెను తీసుకురాగానే వెలుతురు చూడగానే కళ్ళు గట్టిగా మూసుకుందని చీకటిలో ఇన్నేళ్లు ఉండటం వల్ల తాను వెలుతురు చూడలేక పోయిందని చెప్పారు. ఇక ఆమెను తన భర్త మానసికంగాను, శరీరకంగాను హింసించాడు అంటూ సాయి సుప్రియ తెలిపారని బెండి వెంకటరావు తెలిపారు. కోర్ట్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆమెను తన తల్లిదండ్రుల వద్ద ఉంచినట్లు చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago