Pushpalatha : విజనగరంలో సంచలనం రేపిన సాయి సుప్రియ 13 ఏళ్ల నిర్భంధం ఇష్యూలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయి సుప్రియనే కాకుండా ఆమె తోడి కోడలు పుష్పలత ను కూడా మధుసూదన్ అతని కుటుంబం ఎలా వేదించారో సాయి సుప్రియ ఉదంతం తరువాత మీడియా ముందుకు వచ్చిన పుష్పలత వివరించారు. మధుసూదన్ తమ్ముడు దుర్గ ప్రసాద్ భార్య అయిన పుష్పలత ఆమెను అత్తింటి వారు పెట్టిన టార్చర్ గురించి వివరించారు.
కన్న కొడుకుతో పిన్ని అని పిలిపించారు…
మధుసూదన్ కుటుంబం చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. గోదావరి మధుసూదన్ తమ్ముడు వెంకట దుర్గ ప్రసాద్ కూడా తన భార్యను టార్చర్ చేయడంతో ఆమె అక్కడి నుండి బయటకు వచ్చి వేరుగా ఉంటోంది. ఐదేళ్లుగా భర్త ఎక్కడున్నాడో కూడా తెలిదని, సాయి సుప్రియ ఇష్యూ వల్ల మీడియాలో భర్తను చూసానని చెబుతున్న పుష్పలత అత్తింటి వేధింపుల గురించి మాట్లాడారు. మొదట బెంగుళూరులో ఉన్న వాళ్ళు విజయనగరం వచ్చేసాక ఒక బాబు పుట్టాక బాబు అలనా పాలనా అంత తాను చూసుకున్నా నన్ను అమ్మగా కాకుండా వేరే మనిషిలాగా కొడుకుకు చెప్పి పెంచారని, నా దగ్గర ఉంచకుండా దూరం చేసారని చెప్పారు.
రెండో బాబు పుట్టాక పిల్లలకు బాత్రూమ్ దగ్గర తిండి పెట్టడం నాకు కుక్కవు వేసినట్లు అన్నం ప్లేట్ లోకి వేసి బాత్రూమ్ పక్కన కూర్చో పెట్టి పెట్టడం చేసే వారని, గొడవ పడి బయటకు వస్తే తల్లిదండ్రుల పరువు పోతుందని, బిడ్డలకు తండ్రి ఉండడని భయపడి ఓర్చుకున్నా పిల్లల విషయంలో అలా ప్రవర్తించేసరికి ఉండలేక వచ్చేసానని అయితే నేను రెండో బాబును తీసుకువచ్చేసానని మొదటి బాబు అక్కడే ఉండిపోయాడని, వాడికి నేను కన్న తల్లిని అనే విషయం కూడా తెలుసో లేదో తెలియదంటూ ఎమోషనల్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…